దేశంలో ప్రజాస్వామ్యం అర్ధం మారిపోయి చాలాకాలం అయింది. కుటుంబస్వామ్యంగా దాన్ని మార్చుకుని తరాలు తరాలుగా అధికారాన్ని ఇంటి గుమ్మానికి కట్టేసుకున్న వైనాన్ని జాతి జనులు చూస్తూనే ఉన్నారు. పేరు గొప్ప ప్రజాస్వామ్యంలో రాజు తరువాత యువరాజే మహా కిరీటధారి కావాలి. ఇది నయా రాజ్యాంగ నిర్మాతలు పెట్టిన  రూల్.


కేసీయార్ తెలివిడి :


చంద్రబాబు వద్ద శిష్యరికం చేసినా రాజకీయ చాణక్యం విషయంలో కేసీయార్ నాలుగాకులు ఎక్కువే చదివారు. తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలకు కొత్త ఒరవడి తీసుకువచ్చారు. ఆయన కుటుంబాన్ని రాజకీయాల్లో హైలెట్ చేస్తూ తెలివిగా వ్యవహరించారు. లేటెస్ట్ గా పుత్రరత్నం కేటీయార్ ని పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ గా నియమించి కేసీయార్ భావి మహారాజు ఆయనేనని చెప్పకనే చెప్పేసారు.

 ఇక మరో అరు నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఏంటన్నది చూసుకుని డిల్లీలో కేసీయార్ చక్రం తిప్పుతారని తెలుస్తోంది. ఇక తెలంగాణాకు తొందరలోనే కాబోయే ముఖ్యమంత్రి కేటీయార్ అన్నది కూడా తాజ ఎత్తుగడతో తేలుతోంది. మొత్తానికి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే నైపుణ్యంలో కేసీయార్ ఆరితేరారంటున్నారు.


లోకేష్ వైపు చూపు  :


ఇక ఏపీలో ఫక్త్ కేసీయార్ రాజకీయాన్ని కాపీ కొడుతున్న నలభయ్యేళ్ళ ఇండస్ట్రీ చంద్రబాబు కూడా  తెలంగాణా పరిణామాలను చూసి తొందరపడతారని అంటున్నారు. అక్కడ కేటీయార్ని మంత్రిని చేస్తే ఇక్కడ లోకేష్ ని మంత్రిని చేశారు. అక్కడ ఇపుడు పార్టీ మొత్తం కేటేయర్ కి రాసి ఇచ్చేశారు. ఇక సీఎం సీటు కూడా కన్ ఫర్మ్ అయిపోతోంది. మరి లేకేష్ కి ఆ మంచి రోజులు ఎపుడా అని కుటుంబస్వామ్యం ప్రేమికులంతా టీడీపీలోనూ, బయటా ఎదురుచూస్తున్నారు.

 అయితే కేసీయర్ వ్యవహారం వేరు. ఆయన ఎన్నికలలో మళ్ళీ గెలిచి ఫ్రీ అయిపోయారు. బాబుది అలా కాదు, రేపు భీకర సమరంలో తలపడాలి. మరో మారు గెలవాలి.  అపుడే లోకేష్ బాబు ముఖ్యమంత్రి పీఠం అలంకరించే సౌభాగ్యం  దక్కుతుంది.  టీడీపీ సహా జాతి జనులంతా ఆ ముచ్ఛట చూసి తరించే అద్రుష్టమూ  ప్రాప్తిస్తుంది. మరి ఆ దిశగానే ప్రస్తుతం టీడీపీ అధినాయకుడు పావులు కదుపుతున్నారు. మరి  పార్టీకి ఘనమైన  విజయం అందించి చినబాబుని ఫ్యూచర్ సీఎమ్ ని  చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రజలదే.


మరింత సమాచారం తెలుసుకోండి: