ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షుడు, పెదబాబు, చినబాబులకు నమ్మిన బంటు. అన్నిటికీ మించి టీడీపీలో సీనియర్ నాయకుడు. దాదాపుగా నాలుగు దశాబ్ధాల రాజకీయ అనుభవంతో తల పండిన నేత. అటువంటి నాయకుడు  ఇపుడు తడబడుతున్నాడు. ఎన్నికలు ముంగిట్లో ఉంచుకుని మరీ తెగ బేజారవుతున్నారు. 


పోటెత్తిన జనం:


కళా వెంకటరావు సిక్కోలు రాజకీయాల్లో కీలకమైన నాయకుడు.  అయన ప్రాతినిధ్యం  వహిస్తున్న ఎచ్చెర్లలో జగన్ పాదయాత్రకు జనం ఓ రేంజిలో పోటెత్తారు. ఇసుక వేస్తే రాలనంతగా హాజరయ్యారు. దాంతో కళాలో కలవరం బయల్దేరింది. తన సీటుకే ఎసరు వచ్చిందా అన్న కంగారూ పుట్టింది. కళాకు అక్కడ బలం ఉన్నప్పటికీ, ఈ మధ్య జరిగిన పరిణామాలు కూడా కలవరపెడుతున్నాయి. పార్టీలో మాజీ స్పీకర్ ప్రతిభా భారతి వర్గం వ్యతిరేకంగా ఉండడం, జనంలో  నానాటికీ పెరుగుతున్న వ్యతిరేకత వంటివి కళాకు రేపటి ఎన్నికలపై ఆందోళన కలిగిస్తున్నాయి.


జగన్ టార్గెట్:


నాటి నుంచి కళా ఒకటే పేరు జపిస్తున్నారు. జగన్ పైన విరుచుకుపడుతున్నారు. జగన్ పాదయాత్రలో ఉన్న ఈ టైంలో ఆయనకు రెండు బహిరంగ లేఖలు రాసిన కళా వరసగా మీడియా మీటింగులు పెట్టి మరీ వైసీపీ అధినేతను కడిగేస్తున్నారు. ఆఖరుకు అది ఎంతకు వెళ్ళిందంటే వైసీపీ జగన్ సొంత పార్టీ కాదంటూ కళా తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జగన్ని నమ్మవద్దంటూ ఆయన జనాని కోరడం గెలుపు పట్ల సన్నగిల్లిన నమ్మకాన్ని సూచిస్తోందని వైసీపీ నెతలు అంటున్నారు. మొత్తానికి కళాను అమరావతి నుంచి సొంత జిల్లాకు దింపిన ఘనత మాత్రం జగన్ దేనని సెటైర్లు పడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: