ఎన్నికలు తరుముకొస్తున్న నేపధ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్ధులను ఫైనల్ చేసేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఇఫ్పటికి సుమారు 6 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఖరారైనట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలున్నాయి. పోయిన ఎన్నికల్లో మెజారిటి సీట్లను వైసిపినే గెలిచింది. కాకపోతే ప్రలోభాలకు గురిచేసి పలువురు ఎంఎల్ఏలను చంద్రబాబునాయుడు టిడిపిలోకి లాగేసుకున్నారు. ఒకవైపు పాదయాత్రలో బిజీగా ఉన్న జగన్ మరోవైపు అభ్యర్ధులను ఖరారు చేయటంలో పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఈమధ్యనే జిల్లాలోని కీలక నేత బాలినేని శ్రీనివాసులరెడ్డిని పిలిపించుకున్న జగన్ అభ్యర్ధుల బలాబలాల విషయంపై చర్చించారట.

 

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఎర్రగొండపాలెంలో వచ్చే ఎన్నికల్లో ఎంఎల్ఏ ఆదిమూలపు సురేషే పోటీ చేస్తారు.  ఒంగోలు నుండి బాలినేని శ్రీనివాసులరెడ్డి, కందుకూరు నుండి మానుగుంట మహీధర్ రెడ్డి, కనిగిరి నుండి బుర్రా మధుసూధన్ టిక్కెట్లు ఫైలన్ అయ్యాయి. ఇక గిద్దలూరు నుండి అన్నా రాంబాబు, దర్శి నుండి మద్దిశెట్టి వేణుగోపాల్ టిక్కెట్లు కూడా దాదాపు ఖాయమనే అనుకోవాలి. మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్ధుల ఎంపికపై జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇఫ్పుడు నియోజకవర్గాల ఇన్చార్జిలకే టిక్కెట్లు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

 మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్దుల విషయంలో క్లారిటీ కోసమని జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ఒంగోలు, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల పరిశీలకులు మోపిదేవి వెంకటరమణ, వైవి సుబ్బారెడ్డిల కమిటి నియోజకవర్గాల్లోని నేతలతో సమావేశాలు పెట్టి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. తెలంగాణాలో కెసియార్ కూడా దాదాపు రెండు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించటం ద్వారా లబ్ది చేకూరింది. అసంతృప్తులను బుజ్జగించేందుకు, తమపై ఉన్న వ్యతిరేకతను సర్దుబాటు చేసుకునేందుకు అభ్యర్ధులకు మంచి సమయం దొరికింది. కాబట్టి కెసియార్ ఫార్ములానే ఏపిలో అమలు చేయాలని జగన్ నిర్ణయించుకున్నారట. కాబట్టి జనవరి నెలాఖరు నాటికే అన్నీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఫైనల్ చేయటానికి జగన్ రెడీ అవుతున్నారు.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: