తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కొడంగల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి భవిష్యత్తు రాజకీయాలలో రాణించడానికి సరికొత్త ప్లాన్ వేసినట్లు సమాచారం.

Image result for revanth reddy

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ పై మరియు కెసిఆర్ కుటుంబం పై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి ఓటమిపాలయ్యాడు అన్న వార్త తెలంగాణ రాజకీయాల్లోని సంచలనం సృష్టించగా మరో పక్క టిఆర్ఎస్ పార్టీలో... రేవంత్ రెడ్డి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చేసిన సవాళ్లకు సమాధానం ఏంటి అన్న ప్రశ్నలు వేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు.

Related image

ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు అంధకారం లోకి వెళ్లకుండా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారట రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీకి దిగాలని యోచిస్తున్నట్లు సమాచారం. రేవంత్‌రెడ్డిని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీకి దింపుతుండ‌గా తెరాస కూడా త‌న మాజీ ఎమ్మెల్యేను చేవెళ్ల నుంచి రంగంలోకి దింపుతోంది.

Image result for revanth reddy

రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే. అత‌ని త‌ర‌హాలోనే తెరాస నేత ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి కూడా కీల‌కంగానే వ్య‌వ‌హ‌రించారు. అలాంటి నేత‌ను ప‌క్క‌న పెట్ట‌డం ఇష్టం లేని తెరాస అధినేత చేవెళ్ల నుంచి ఆయ‌న్ని పోటీకి దింపుతున్న‌ట్లు తెలిసింది. మొత్తం మీద పార్లమెంటు ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ ఎపిసోడ్ కంటిన్యూ అవుతున్నట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: