తెలంగాణ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు.. బామ్మర్ది బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు దివంగత ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి. భారీ బహిరంగ సభలలో భారీ భారీ డైలాగులు చెబుతూ కొన్ని కొన్ని సార్లు అర్థం కాకుండా తిక్కగా ప్రవర్తించే బాలయ్య బాబు ఇటీవల సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా అని పలకడానికి బుల్ బుల్ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో అనేక మంది నెటిజన్లు బుల్ బుల్ బాలయ్య అంటూ తెగ విమర్శలు కామెంట్లు చేశారు.

Image result for bul bul balayya

ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు. బాలకృష్ణ ప్రసంగాలపై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నించగా..ఒక మనిషి తన లోపాన్ని తెలుసుకుని సరి దిద్దుకోవాలి అలా సరి దిద్దుకుంటేనే తర్వాత ఆ తప్పు జరుగకుండా ఉంటుంది.

Image result for lakshmi parvathi

కాని బాలకృష్ణ మాత్రం పదే పదే ఆ తప్పును చేస్తూ ఉన్నాడు. మొన్న తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థులు అయ్యో.. బాలకృష్ణ మా నియోజక వర్గంకు వచ్చి తెలుగు దేశం తరపున ప్రచారం చేస్తే బాగుండేది అప్పుడు మేము గెలిచే వాళ్లం అనుకుంటున్నారు.

Related image

బాలకృష్ణ మాట్లాడే మాటలు పూర్తిగా అర్థం అయ్యాయి అంటూ ఎవరైనా నా వద్దకు వస్తే వారికి బహుమానం ఇస్తానంటూ లక్ష్మీ పార్వతి నవ్వుతూ కామెంట్ చేసింది. తెలుగుదేశం పార్టీలో ఒక బాలకృష్ణ మాత్రమే కాదు..చంద్రబాబు మరియు ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా ఎప్పుడూ ఎలాగా ఏమి మాట్లాడతారో ఎవరికి అర్థం కాదని సంచలన కామెంట్లు చేసింది లక్ష్మీపార్వతి.  



మరింత సమాచారం తెలుసుకోండి: