క్రిస్మస్ అంటే డిసంబ‌ర్ 25 ఒక్క రోజే కాదు. అంతకు నెల రోజుల ముందు నుంచి సందడి మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దేశ దేశాలు క్రిస్మస్ ని అత్యంత ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. క్రీస్తు శకం అంటూ మొదలయ్యే కాలమానానికి శక పురుషుడు ఏసు ప్రభువు. మొత్తం భూగోళం ఒక్కటిగా చేసిన వేడుక కూడా ఇదే.


ప్రేమ. త్యాగం:


క్రీస్మస్ అంటే ఠక్కున చెప్పగలిగేవి రెండే రెండు మాటలు. అవి ప్రేమ. త్యాగం. విశ్వ మానవాళిని వాటిని అందించడానికి భువికి దిగి వచ్చిన దేవ దూత ఏసు ప్రభువు అని భక్తి ప్రపత్తుల‌తో కొలుస్తారు. ఏసు తన వారి కోసం శిలువ ఎక్కిన దేవ దేవుడు. ఆపన్నుల కనీరు తుడిచేందుకు తనను తాను బలి చేసుకున్న మాననీయుడు. మహా పురుషుడు. త్యాగం అన్న మాటకు నిలువెత్తు అర్ధం, అద్దం కూడా క్రీస్తు అని చెప్పాలి. 


అంతా ఒకటే :


మతాలు, కాలాలు, వర్గాలు, వైషమ్యాలు అన్నీ వదలి ప్రేమ లోకం వైపుగా రారమ్మని పిలిచిన దైవ కుమారుడు ఏసు. ప్రేమతో సర్వం జయించవచ్చునని ఆచరణాత్మకంగా చాటి చెప్పిన దైవాంశ సంభూతుడు ఏసు. పేద, గొప్పా తేడా లేదు. అందరూ ఆ దేవుని దీవెనలే అని లోకానికి తెలియచేసేందుకు కడు పేదగా అవతరించి తరింపచేశాడు ఏసు. ఏసు నడయాడిన నేలపై ఈనాడు సమస్త జీవరాశి సంచరిస్తోంది. ఆయన చూపిన మార్గం సత్యం. ఆయనే జీవం. ఆయనే సర్వం. క్రీస్మస్ వేడుక చెప్పేది ఇదే. ఈ సందేశమే అన్ని సందేహాలనూ తీరుస్తుంది. ఈ సందేశమే సమస్త దేశాలనూ ఒక్కటి చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: