రేపటి ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం ఎక్కాలనుకుంటున్న వైసీపీ గురించి మాజీ మంత్రి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. జగన్ వైపు కాళ్ళు అరిగేలా పాదయాత్ర చేస్తూంటే గ్రాఫ్ పడిపోవడం ఏంటి మరి...


వైసీపీ తగ్గుతోంది :


వైసీపీ ఊపు గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయిందని ఆ పార్టీలో చాలా కాలం పాటు ఉన్న మాజీ మంత్రి కొణతాల రామక్రిష్ణ అంచనా వేస్తున్నారు. 2014 నాటికి ఇప్పటికీ చూసుకుంటే వైసీపీ మీద జనానికి మోజు తగ్గిందని ఆయన అంటున్నారు. వైసీపీ ప్రధాన ప్రతిపక్షంగా విఫలమైందని ఆయన విమర్శించారు. అధికార పార్టీ టీడీపీని సమర్ధంగా వైసీపీ ఢీ కొట్టలేకపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక మరో పార్టీ జనసేన తీరు చూస్తే సంస్థాగతంగా ఆ పార్టీ ఇప్పటికీ నిర్మాణం లేక బలహీనంగా ఉందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ కి ఆదరణ ఉన్నా జనంలో పార్టీని గట్టిగా నిలబెట్టలేకపోయారని  అన్నారు. ఏపీలో వామపక్షలు తీరు తలో విధంగా ఉందంగా చెప్పుకొచ్చారు.


టీడీపీకి ప్లస్ :


ఇవన్నీ చూసుకుంటే విపక్షాల ఆనైఖ్యత టీడీపీకి ప్లస్ గా ఉందని కొణతాల అంచనా వేశారు. ఇప్పటికైతే టీడీపీ ఏపీలో బలంగా ఉందని ఆయన అన్నారు. మరో వైపు తాను తొందరలోనే ఏ రాజకీయ పార్టీలో చేరేదీ నిర్ణయం తీసుకుంటానని చెబుతున్న కొణతాల టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రకు మేలు చేస్తున్నారని కీర్తించడం  విశేషం. మొత్తానికి చూసుకుంటే ఈ మాజీ మంత్రి గారు త్వరలోనే సైకిలెక్కబోతున్నారని అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: