వెన్నుపోటు పాటతో పాటు అదే వెన్నుపోటుకు కారణమైన చంద్రబాబు ఫొటోల్ని నీట్ గా ఎడిటింగ్ చేసి మరీ వదిలాడు.లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా నుంచి వెన్నుపోటు పాట ఇదేనంటూ సాంగ్ రిలీజ్ చేసిన వర్మ, తన ట్వీట్ లో కత్తి ఫొటోల్ని కూడా పెట్టాడు. పాటలో మోసం, దగా, కుట్ర, వెన్నుపోటు అనేపదాలు వచ్చిన ప్రతిసారి చంద్రబాబు ఫొటోను పదేపదే చూపించాడు వర్మ. మరీ ముఖ్యంగా "దొంగ ప్రేమ నటనలే చూపి".. "కలియుగాన శకునులై" అనే పదాలు వచ్చినప్పుడు చంద్రబాబు ఫొటోల్ని విచ్చలవిడిగా వాడాడు వర్మ.

వర్మ 'వెన్నుపోటు' పాట.. ఉలిక్కిపడిన బాబు

ఓవరాల్ గా ఈ వెన్నుపోటు సాంగ్ తో తను నేరుగా వ్యాఖ్యానాలు చేయకపోయినా.. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిందెవరనే విషయాన్ని వీడియో సాక్షిగా బయటపెట్టాడు వర్మ. కల్యాణి మాలిక్ ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు స్వయంగా ఆలపించాడు. సిరాశ్రీ సాహిత్యం అందించాడు. వెన్నుపోటు సాంగ్ ఇలా రిలీజైందో లేదో అలా టీడీపీ భగ్గుమంది. వెన్నుపోటు, శకుని, కుట్ర లాంటి పదాలపై నేరుగా చంద్రబాబు ఫొటోల్ని పెట్టడాన్ని టీడీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు.

Image result for ram gopal varma

యూట్యూబ్ లో ఈ వీడియోను అడ్డుకునేందుకు ఇప్పటికే చంద్రబాబు డిజిటల్ టీం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. మరో బ్యాచ్, వర్మపై కోర్టు కేసు వేసే ఆలోచనలో ఉంది. వీళ్లతో పాటు టీడీపీ బ్యాచ్, చంద్రబాబు అభిమానులంతా సోషల్ మీడియాలో వర్మను ఆడిపోసుకుంటున్నారు. వర్మను ఇష్టమొచ్చినట్టు తిడుతున్నారు. వర్మ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన్ను మెచ్చుకుంటున్నారు. ఇప్పటివరకు వర్మ తీసిన సినిమాల్లో ఇదే బోల్డ్ మూవీ కాబోతోందంటూ పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: