మూడు మార్లు ముఖ్యమంత్రిగా. నలభయ్యేళ్ళ రాజకీయ జీవితం పండించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పాతిక ఎంపీ సీట్లు గెలిచి డిల్లీలో  చక్రం తిప్పాలని బాబు యత్నిస్తున్నారు. అందుకోసం  ఆయన కూటమి రాజకీయాలను కూడా తలకెత్తుకున్నారు. కాంగ్రెస్ తో కలిపి తెలంగాణాలో ప్రజా కూటమిని ఏర్పాటు చేసిన చంద్రబాబు డిల్లీ స్థాయిల్లోనూ అన్ని పార్టీలను కలుస్తున్నారు. 


బాబు ప్రభావం నిల్ :


వచ్చే ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ప్రభావం ఏమీ ఉండదని బీజేపీ నేత రాం మాధవ్ గాలి తీసేశారు. ఏపీ సీఎం గానే బాబు ఘోరంగా విఫలం అయ్యారని ఆయన సెటైర్లు వేశారు. ఈ రోజు విజయనగరంలో ఉత్తరాంద్ర్హ బీజేపీ కార్యకర్తల భేటీలో రాం మాధవ్ మాట్లాడుతూ బాబు తప్పులను బీజేపీపై తోసేందుకే మోడీని తిడుతున్నారని అన్నారు. బాబు కాంగ్రెస్ తో కట్టిన కూటమిని తెలంగాణాలో ఓడించారని, రేపటి రోజున ఏపీలోనూ అదే జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ తో మొదలైన బాబు రాజకీయ జీవితం చివరికి ఆ పార్టీతోనే ముగియడం జరుగుతోందని అన్నారు.


మోడీ అన్నీ చెబుతారు :


ఇక ఏపీకి బీజేపీ ఏం చేసిందన్నది ప్రధాని మోడీ తన ఏపీ పర్యటనలో చెబుతారని రాం మాధవ్ అన్నారు. కార్యకర్తలకు ఉత్తేజం తీసుకువచ్చేలా మోడీ ఏపీ టూర్ ఉంటుందని రాం మాధవ్ చెప్పుకొచ్చారు. ఏపీకి మోడీ ఎంతో చేశారని, నిధులు కూడా పెద్ద ఎత్తున కేటాయించారని వివరించారు. ఇక వచ్చే  ఎన్నికల్లో ఏపీలో బీజేపీ ఒంటరి పోరు చేస్తుందని, దానికి సిధ్ధపడి కార్యకర్తలంతా పని చేయాలని రాం మాధవ్ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: