ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడు మళ్లీ ప్రధాన మంత్రి చుట్టూ తిరుగుతోంది. కొత్త ఏడాది తొలివారంలో మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదా అంశం తెరమీదకు వచ్చింది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన తర్వాత మోదీ ఏపీలో పర్యటించడం ఇదే తొలిసారి. గతంలో వచ్చినప్పుడు మట్టి, నీరు తెచ్చిన మోదీ.. ఈసారి ఏం తెస్తారనేది ఆసక్తిగా మారింది.

 Image result for modi in andhra pradesh

నాలుగేళ్లపాటు రాష్ట్రం టీడీపీ-బీజేపీ అధికారంలో ఉన్నాయి. ఆ తర్వాత అనేక పరిణామాల నేపథ్యంలో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇక్కడ టీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నుంచి టీడీపీ బయటికొచ్చేశాయి. అప్పటి నుంచి ఆ రెండు పార్టీల మధ్య వార్ మొదలైంది. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాలను కేంద్రం ఇవ్వట్లేదని, విభజనచట్టంలోని హామీలను నెరవేర్చడం లేదని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువ లబ్ది పొందిన రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని బీజేపీ చెప్తోంది.

 Image result for modi in andhra pradesh

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక హోదా అంశం సెంటిమెంట్ గా మారిపోయింది. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని బీజేపీ చెప్పడంతో దానికి టీడీపీ అంగీకరించింది. అయితే ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని టీడీపీ కోరడంతో సమస్య మొదటికొచ్చింది. అంతేకాక రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్, వెనుకబడిన జిల్లాలకు నిధులిచ్చి వెనక్కు తీసుకోవడం .. లాంటి అంశాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, టీడీపీ-బీజేపీ మధ్య దూరం పెంచేశాయి. ఈ నేపథ్యంలో మోదీ రాష్ట్ర పర్యటన ఆసక్తి కలిగిస్తోంది.

  Image result for modi in andhra pradesh

ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. రైల్వే జోన్ లేదు.. స్టీల్ ప్లాంట్ లేదు.. ఇలా రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన అంశాల విషయంలో బీజేపీ సరిగా స్పందించలేదనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో మోదీ ఎలా రాష్ట్రంలో పర్యటిస్తున్నారనే వాదన పలు పార్టీల నుంచి వ్యక్తమవుతోంది. వీటిపై సమాధానం చెప్పిన తర్వాతే రాష్ట్రంలో అడుగు పెట్టాలని డిమాండ్ వస్తోంది. స్థానిక బీజేపీ నేతలు కూడా దీనిపై కేంద్రాన్ని నిలదీయాలని కోరుతున్నారు పలువురు నేతలు.

 Image result for modi in andhra pradesh

వాస్తవానికి ఏపీలో బీజేపీ పరిస్థితి దారుణంగా ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే ఘోరంగా ఉంది. రాష్ట్రాన్ని విభజించడం ఇబ్బంది కలిగించే అంశమే అయినా... అధికారంలోకి రాగానే నాడు మాట ఇచ్చినట్లు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెప్తోంది. దీంతో.. ఆ పార్టీ పట్ల సానుభూతి వ్యక్తమవుతోంది. అదే సమయంలో మాట ఇచ్చి తప్పిన బీజేపీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితి నుంచి బీజేపీ ఎలా బయటపడుతుందనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం.

 Image result for ap bjp

ప్రధాని మోదీ ఇప్పుడు రాష్ట్రంలో పర్యటిస్తుండడంతో బీజేపీలో మళ్లీ కాస్త ఆశలు రేకెత్తుతున్నాయి. ఈ దఫా అయినా రాష్ట్రానికి కాస్త వరాలిస్తారేమోనని అధికార పార్టీ మాత్రమే కాదు.. బీజేపీ సహా విపక్షాలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈదఫా కూడా మట్టీనీరుతో సరిపెట్టుకోండంటే మాత్రం బీజేపీ పరిస్థితి నాటి కాంగ్రెస్ లాగా తయారవడం ఖాయం. మరి ఈ సిచ్యుయేషన్ నుంచి మోదీ గట్టెక్కిస్తారా.. లేకుంటే మరింత దిగజార్చుతారా.. అనేది వేచి చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: