ఏపీలో అత్యంత వెనకబడిన జిల్లా శ్రీకాకుళం. ఈ జిల్లా ఇపుడు రాజకీయంగా మారుమోగుతోంది. గత పదిహేను రజులుగా వైఎస్ జగన్ ఇదే జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు శ్రీకాకుళంలో ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. అంటే సీఎం, అపోజిషన్ లీడర్ ఇద్దరూ ఒకే రోజు ఇక్కడే ఉన్నారన్నమాట. టెక్కలిలో జగన్ మీటింగు జరిగితే శ్రీకాకుళం టౌన్లో చంద్రబాబు దీక్ష జరిగింది.


జగన్ పై బాబు విసుర్లు :


తితిలీ తుపాను శ్రీకాకుళాన్ని అతలాకుతలం చేస్తే జగన్ కి పట్టలేదని చంద్రబాబు ఈ సందర్భంగా విమర్శించారు.  జగన్ కి కేవలం అధికారం తప్ప మరేమీ కనబడడంలేదని అన్నారు. తెలంగాణాలో టీయారెస్ గెలిస్తే జగన్ ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నరని నిందించారు. మోడీని ఒక్క మాట అనలేని జగన్ తనపైన విరుచుకుపడుతున్నారని బాబు ఫైర్ అయ్యారు. జగన్ కేసీయార్ అంతా కలసి మోడీతో జట్టు కట్టి ఏపీని దెబ్బ తీస్తున్నారని అన్నారు. టీడీపీకి లాలూచీ రాజెకీయాలు అసలు తెలియవని బాబు అన్నారు. అన్న నందమూరి ఇష్టపడిన జిల్లా శ్రీకాకుళం అభివ్రుధ్ధి చేసింది టీడీపీనేనని అన్నారు.


గొప్పల బాబు :


తిట్లీ తుపాను వచ్చి దాదాపు రెండు నెలలు గడిచినా ప్రభుత్వం  ఇంత వరకు రైతులకు పరిహారం అందజేయలేదని టెక్కలి మీటింగులో జగన్‌  మండిపడ్డారు. తుపాను వల్ల రాష్ట్రంలో రూ.3,435 కోట్లు నష్టం వాటిల్లితే బాధితులకు 15శాతం డబ్బులు కూడా ఇవ్వని చంద్రబాబు.. ప్రచారం మాత్రం తారాస్థాయిలో చేసుకున్నారని విమర్శించారు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ వ్యవస్థ(ఆర్టీజీఎస్‌)తో అద్భుతాలు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబుకు ఫీజు రియింబర్స్‌మెంట్ బాకాయిలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు పడుతున్న అవస్థలు కనబడలేదా అని నిలదేశారు.

 520 కోట్ల బకాయిలు ఇవ్వకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవల నిలిచిపోయిన విషయం కాని,  ప్రతిగ్రామంలో మూడు, నాలుగు బెల్టు షాపులు ఉన్నాయన్న విషయం కనిపించడం లేదా అని ప్రశ్నించారు  ప్రచార యావ తప్ప బాబుకు ఏమీ అవసరం లేదని జగన్ విమర్శించారు. మొత్తానికి ఇద్దరు నేతలు సిక్కోలు లో పరస్పర విమర్శలతో హోరెత్తించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: