ఏపీలో పొత్తుల వ్యవహారం పూర్తి అయోమయంలో ఉంది. వామపక్షాలు, జనసేన కలసి పోటీ చేస్తాయనుకుని అంటున్న ఇంకా వాటి మీద ఎటువంటి నిర్ధారణా లేదు. ఇక తెలుగుదేశం పార్టీ తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి  కూటమి కట్టింది. ఏపీలో ఆ పార్టీ ఏం చేస్తుందో తెలియదు. వైసీపీ విషయానికి వస్తే ఒంటరి పోరే అంటున్న తెర వెనక ఏం జరుగుతుందో తెలియడంలేదు.


బయట నుంచి మద్దతు:


ఇక కేంద్రంలో చూసుకుంటే బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజా కూటమి ప్రస్తుతం మోడీ ప్రధానిగా అధికారంలో ఉంది. మరో వైపు రాహుల్ గాంధి కాంగ్రెస్ పెద్దగా బీజేపీయేతర కూటమికి రంగం సిధ్ధం చేస్తున్నారు. దాంట్లో ఏపీ సీఎం చంద్రబాబు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. ఇక ప్రాంతీయ పార్టీలతో కలసి ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీయార్ రాష్ట్రాల వెంట తిరుగుతున్నారు. ఈ నేపధ్యంలో ఏపీలో ప్రధా ప్రతిపక్షం వైసీపీ ఏ కూటమిలో ఉంటుంది. ఎవరికి మద్దతు ఇస్తుందన్న సందేహలు సహజంగానే ఉన్నాయి. దానికి సమాధానం కొంతవరకూ లభించదనుకోవాలి.

2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడంలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ, శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న ఇండియాటుడే సౌత్‌ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ,  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఎంతో అవసరమన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని మోసం చేసిన బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ పార్టీ బయట నుంచి మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు.


కాంగ్రెస్ కేనా :


దీన్ని బట్టి చూస్తూంటే  రేపటి రోజున కేంద్రంలో కాంగ్రెస్ కూటమి కనుక అధికారంలోకి వస్తే వైసీపీ బయట నుంచి మద్దతు ఇస్తుందని ఉమ్మరెడ్డి మాటలని బట్టి అర్ధం అవుతోంది. నిజానికి ప్రత్యేక హోదా అని అంటున్నది ఒక్క కాంగ్రెస్ మాత్రమే, కేసీయార్ ఏపీకి  హోదా వద్దంటున్నారు. బీజేపీ ఇవ్వలేమని  తేల్ఛి చెప్పేసింది, కనుక ప్రత్యేక హోదా కావాలని కోరుతున్న టీడీపీ, వైఖరులను ఇక్కడ తీసుకుంటే కాంగ్రెస్ కూటమిలో టీడీపీ ఉంటే, బయట నుంచి వైసీపీ మద్దతు ఇవ్వాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.

అయితే ఎన్నికలు, ఫలితాలు ఇంకా చాల దూరంలో ఉన్నాయి. అప్పటికి ఏపీలో ఎవరికి మెజారిటీ ఎంపీలు వస్తాయన్న దాని మీద రేపటి పొత్తులు, ఎత్తులు మరో మారు మారే అవకాశాలు కూడా లేకపోలేదు. మొత్తానికి వైసీపీ హోదా విషయంలో కాంగ్రెస్ పట్ల కొంత సానుకూలంగా ఉన్నట్లుగా ఉమారెడ్డి మాటలను బట్టి అనుకోవాల్సి ఉందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: