జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల ఎవరికీ లాభం ఎవరికీ నష్టం అనే లెక్కలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఒక సారి చరిత్ర ను చూస్తే అంటే ప్రజారాజ్యం పార్టీ ఓటు బ్యాంకు ను చూస్తే టీడీపీ కి  జనసేన ద్వారా ఖచ్చితంగా దెబ్బె అని చెప్పొచ్చు. రాయలసీమలో చెప్పుకోదగిన స్థాయిలో ఉన్న బలిజలు అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఓటువేశారు. సీమ నాలుగు జిల్లాల్లోనూ వీరి జనాభా గణనీయంగా ఉంది. ఈ సామాజికవర్గం చిరంజీవిని మొదటి నుంచి ఓన్‌ చేసుకుంది. చిరంజీవి పార్టీని విలీనం చేసి వెళ్లినా.. వీరు మెగాభిమానులుగానే మిగిలారు. పవన్‌ కల్యాణ్‌కు కూడా వీరు ప్రభావితం అవుతున్నారు. రాయలసీమలో పవన్‌ కల్యాణ్‌ పార్టీ తరఫున కొంతమంది నేతలు బయల్దేరారు. ఆర్థికంగా బలవంతులు అయిన వీళ్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఉబలాటపడుతున్నారు.

Image result for janasena pavan

ఇలా ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీచేస్తే తమ గ్రేడ్‌ పెరిగినట్టుగా భావించేవాళ్లు ఈ ప్రయత్నంలో ఉన్నారు. గెలిచేస్తామనేది వీళ్ల లెక్కకాదు. పోటీచేయడం.. ఇరవై, పాతికవేలు ఓట్లు పొందడం కూడా తమను నేతలుగా తయారు చేస్తుందని.. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో మరో పార్టీ టికెట్‌ ను అడగానికి అయినా ఈ పోటీ ఉపయోగపడుతుంది అనేది వీరి లెక్క. ఇలాంటి వాళ్లు పోటీచేసినా.. పవన్‌ కల్యాణ్‌ పార్టీకి కొంతమేర ఓట్లు పడతాయి.

Image result for tdp

చరిత్ర ప్రకారం చూసుకుంటే.. బలిజలు ట్రెడిషినల్‌గా టీడీపీ ఓటు బ్యాంకు. బీసీలకు తోడు బలిజలు ఓట్లు వేయడంతో టీడీపీ సీమలో నెట్టుకొస్తోంది. అయితే.. రెండువేల తొమ్మిదిలో టీడీపీకి ఈ ఓట్లు దూరం అయ్యాయి. చిరంజీవికి బలిజలలో మెజారిటీ ఓట్లు, బీసీల్లో, సినిమా హీరోకి ఓటేయడాన్ని ఆస్వాధించే జనాలు అప్పుడు టీడీపీకి దూరం అయ్యారు. ఎన్టీఆర్‌ సినీ ఇమేజ్‌తో టీడీపీకి అండగా నిలిచినవాళ్లు, చిరంజీవికి అట్రాక్ట్‌ అయ్యారు. ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ తన పార్టీ అభ్యర్థులను సీమలో పోటీపెడితే తెలుగుదేశం పార్టీకి బాగా దెబ్బపడే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా టీడీపీకి పడ్డ నలభై యాభైశాతం బలిజల ఓట్లు పవన్‌ కల్యాణ్‌ వైపు డైవర్ట్‌ అయినా చాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: