ఏపీ రాష్ట్ర రాజకీయాలు సంక్రాంతి పండుగ తరువాత వేసవి వేడిని రగిలించే అవకాశాలు పక్కాగా కనిపిస్తున్నాయి. అధికార టీడీపీ ఓ వైపు, ప్రతిపక్ష వైసీపీ మరో వైపు దూకుడు రాజకీయాలు వచ్చే నెల నాటికి కీలక దశకు చేరుకుంటాయని భావిస్తున్నారు. దాంతో రెండు పార్టీల్లోనూ ఓ వైపు ఉత్సాహం, మరో వైపు ఆందోళన కనిపిస్తోంది.


తొలి జాబితాలు :


టీడీపీ అధినేత చంద్రబాబు గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల టికెట్లను ముందే ప్రకటిస్తామని చెబుతున్నారు. అందులో భాగంగా తొలి జాబితాను సంక్రాంతి పండుగ తరువాత రిలీజ్ చేస్తామని అంటున్నారు. దాంతో తమ్ముళ్ళలో ఎక్కడ లేని టెన్షన్ పెరిగిపోతోంది. తొలి జాబితాలో ఎవరికి చోటు, మరెవరికి వేటు అన్న చర్చ అపుడే మొదలైంది. ఇక సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఆ పండుగ తరువాత జాబితాతో జాతకం బయటపడుతుందన్న కలవరంలో ఈసారి పెద్ద పండుగను కూదా స్థిమితంగా చేసుకోలేని పరిస్థితి తమ్ముళ్ళకు ఉంది.


 ఇక ఇదే తీరులో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. . అధినెత జగన్ పాదయాత్ర జనవరి మొదటి వారలో ముగుస్తోంది. ఆ తరువాత ఆయన సంక్రాంత్రి వరకూ రెస్ట్ తీసుకుని పార్టీ మీద పూర్తి స్థాయిలో ద్రుష్టి పెడతారని అంటున్నారు. మొత్తం ఏపీ అంతటా తిరిగిన జగన్ కి గెలుపు గుర్రాలపై ఓ అంచనా వుందని దాని ప్రకారం ఆయన సైతం మొదటి జాబితాను టీడీపీకి అటు ఇటుగా జనవరిలోనే ప్రకటిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. దాంతో రెండు పార్టీల్లో కాబోయే రేసు గుర్రాలెవరన్నది జనవరి నెల తేలుస్తుందన్న మాట. ఈ పరిణామాలతో ఏపీ రాజకీయాలు హీటక్కడం ఖాయంగా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: