అలాగే ఉంది చూడబోతే చంద్రబాబునాయుడు తాజా వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు మాట్లాడుతూ, పంచాయితీ మెంబర్ కున్న అనుభవం కూడా జగన్ కు లేదట. ఎకనామిక్స్, సోషియాలజీ గురించి ఏమీ తెలీదుకాబట్టి జగన్ కు ముఖ్యమంత్రయ్యే అర్హత కూడా లేదట. అందుకే అన్నీ ఇచ్చేస్తామని జగన్ చెబుతున్నారంటూ ఎద్దేవా చేశారు. పాలనలో అనుభవం లేదుకాబట్టి అనుభవశూన్యులతో రాష్ట్రానికి చాలా ప్రమాదమని చంద్రబాబు తెగ ఆందోళన పడిపోతున్నారు.

 

మొత్తం మీద చంద్రబాబు బాధ చూస్తుంటే పాదయాత్రలో భాగంగా జగన్ ఇస్తున్న హామీలను జనాలు నమ్మేసి వచ్చే ఎన్నికల్లో వైసిపి ఎక్కడ ఓట్లేసేస్తారో అన్న టెన్షన్ పెరిగిపోతున్నట్లే కనిపిస్తోంది. లేకపోతే చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో ఒక్కదానికి కూడా అర్ధంలేదు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 ఉచిత హామీలను సోషియాలజీ, ఎకనామిక్స్ చదివే ఇచ్చారా ? రైతు రుణమాఫీ చేయమని, నిరుద్యోగ భృతి ఇవ్వమని, కాపులను బిసిల్లో చేరుస్తానని, బోయలను ఎస్టీల్లో చేర్చమని, డ్వాక్రా రుణాలు మాఫీ చేయమని సోషియాలజీలో కానీ ఎకనామిక్స్ లో కానీ చెప్పారా ?

 

ఇక పంచాయితీ బోర్డు మెంబర్ అనుభవం సంగతి చూద్దాం. మూడుసార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపిగా, ఎంఎల్ఏగా గెలిచిన జగన్ ను చంద్రబాబు అవమానించటమే. జగన్ అనుభవాన్ని ప్రస్తావిస్తున్న చంద్రబాబుకు పుత్రరత్నంకు ఏమనుభం ఉందని పంచాయితీ రాజ్, ఐటి శాఖల మంత్రిపదవిని కట్టబెట్టారు. పైగా లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి కాకుండా దొడ్డిదోవన ఎంఎల్సీగా నామినేట్ అయి మంత్రివర్గంలో దూరారు. పదవులు అందుకోవటానికి జగన్ కైతే అనుభవం లేదు. అదే లోకేష్ కు మాత్రం వారసత్వ హోదా చాలన్నట్లుగా ఉంది చంద్రబాబు మాటలు.


మరింత సమాచారం తెలుసుకోండి: