తమ బంధువు పట్ల నిర్లక్ష్యం వహించారని..సరైన సమయానికి ట్రీట్ మెంట్ చేసి ఉంటే తమ బంధువు బతికి పోయేవారని డాక్లర్ల నిర్లక్ష్యానికి రివేంజ్ అంటూ ఆసుపత్రిని నానా బీభత్సం సృష్టంచారు..మృతుడి బంధువులు.  ఫర్నీచర్ ధ్వంసం చేయడమే గాకుండా అడ్డొచ్చిన పోలీసులపై దాడికి దిగారు. అందే కాదు వారు దగ్గరకు వస్తుంటే బండ బూతులు తిడుతూ..ఇక్కడ మీకేం పని..మీరు ప్రాణాలు తిరిగి తీసుకు వస్తారా..వెళ్లండి అంటూ పోలీస్ లపైనే రివర్స్ అయ్యారు.  సీఐని నెట్టివేస్తూ అక్కడినుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీచేశారు.


లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది. కాగా ఈ తతంగానికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. షమీమ్ బేగం అనే మహిళ గుండెనొప్పితో గ్లోబల్ ఆసుపత్రిలో చేరారు. అయితే చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె మృతిచెందారు. అయితే  షమీమ్ బేగం చనిపోవడానికి కారణం డాక్లర్ల నిర్లక్ష్యం అంటూ ఆమె బంధువులు ఆరోపిస్తు..ఆందోళనకు దిగారు.  దాంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. 

hyderabad global hospital furniture damaged by some people

అప్పటికే ఆమె బంధువులు ఆసుపత్రిలో  ఫర్నీచర్, కంప్యూటర్స్ ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు.  అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై జులుం చేశారు.  మొత్తానికి అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.  హస్పిటల్ పై దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకొని వదిలేశారని పలువురు ఆరోపిస్తున్నారు.  ఆసుపత్రిపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: