2019 లో ఎన్నికలకు ఇంకా 6 నెలలు కూడా సమయం లేకపోవడంతో అన్ని పార్టీలు తమ వ్యహాలకు పదును పెడుతున్నాయి . అయితే రిపబ్లిక్ టీవీ సర్వే వెల్లడించిన ఫలితాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. రానున్న 2019 లోకసభ ఎన్నికల్లో ఎన్డీయేనే తిరిగి విజయం సాధిస్తుందని, ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు కలిస్తే మాత్రమే ఎన్డీయేకు మేజిక్ ఫిగర్‌కు కొన్ని సీట్లు తక్కువగా వచ్చే అవకాశముంది. మొత్తానికి బీజేపీ హవానే ఉంటుందని పలు సర్వేలు తెలుపుతున్నాయి. అయితే, ఉత్తరాదిన, ఈశాన్య రాష్ట్రాల్లో, తూర్పు భారతంలోనే బీజేపీ హవా కనిపించనుంది. దక్షిణాదిన మాత్రం బీజేపీకి ఇంకా బలం పెరగడం లేదని ఈ సర్వేలు వెల్లడిస్తున్నాయి. దక్షిణాదిన మొత్తం 129 లోకసభ స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 25, తెలంగాణలో 17, తమిళనాడులో 39, కేరళలో 20, కర్ణాటకలో 28 లోకసభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 129 లోకసభ స్థానాల్లో స్వల్ప స్థానాలు గెలిచింది. 

 సర్వే ప్రకారం బీజేపీ ప్రభావం నామమాత్రమే

అదే సమయంలో, దక్షిణాదిన ఈసారి సరికొత్త పొత్తులు కనిపిస్తున్నాయి. మూడున్నర దశాబ్దాలకు పైగా కాంగ్రెస్, టీడీపీలు కలవలేదు. ఇప్పుడు మొదటిసారి ఏపీలో ఆ రెండు పార్టీలు కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఏపీలో టీడీపీపి ప్లస్ కానుంది. గతంలో ఏపీబీ - సీ ఓటరు సర్వేలో ఏపీలో జగన్ పార్టీకి 21, టీడీపీకి 4 సీట్లు వస్తాయని తేలింది. కానీ కాంగ్రెస్‌తో పొత్తు తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడినప్పటికీ.. ఏపీలో మాత్రం ఆ రెండు పార్టీల కలయిక ప్లస్ కానుందని ఈ సర్వేల ద్వారా తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణలలో టీడీపీ, తెరాసలదే హవా

తాజాగా రిపబ్లిక్ టీవీ సర్వే, సీ ఓటరు సర్వేలు అదే చెబుతున్నాయి. కాంగ్రెస్ పొత్తు కారణంగా టీడీపీ కూటమికి అంటే యూపీఏకు 11 సీట్లు, వైసీపీకి 14 సీట్లు వస్తాయని రిపబ్లిక్ సర్వేలో తేలింది. గతంలో సీ ఓటరు సర్వేలో వైసీపీకి 21 సీట్లు వస్తాయని తేలింది. ఇప్పుడు వైసీపీకి ఏకంగా 7 సీట్లు తగ్గుతున్నాయి. ఇక్కడ బీజేపీకి ఏ పార్టీతోను పొత్తు లేనందున ఎన్డీయేకు సీట్లేమీ రావని తేల్చింది. ఆ తర్వాత సీ ఓటరు సర్వే కూడా ఏపీలో టీడీపీకి గతంలో కంటే ఎక్కువ మద్దతు పెరిగిందని తెలిపింది. ఇక, తెలంగాణలో తెరాసకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: