ఏసు ప్రభువు మరణించిన రోజును అంటే వర్ధంతినే క్రిస్త్ మస్ గా జరుపుకుంటారంటూ ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మామూలుగా అయితే ఏసుప్రభువు జన్మదినాన్నే ప్రపంచమంతా క్రిస్త్ మస్ గా జరుపుకుంటారని ఇఫ్పటి వరకూ అందరూ అనుకుంటున్నారు. చిన్నప్పటి నుండి స్కూళ్ళల్లో కూడా అలాగే చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా అలాగే చెబుతారు. కానీ ఒక్క ఆదినారాయణరెడ్డి మాత్రమే ఏసు ప్రభువు వర్ధంతిని క్రిస్త్ మస్ గా జరుపుకుంటారని చెప్పటం సంచలనంగా మారింది.

 

డిసెంబర్ 25వ తేదీన కడప జిల్లాలో బద్వేలు మాజీ మంత్రి వీరారెడ్డి వర్ధంతి జరిగింది. ఆ కార్యక్రమానికి ఆదినారాయణరెడ్డి హాజరయ్యారు. సరే వర్ధంతికి హాజరయ్యారు కాబట్టి మాజీ మంత్రి గురించి ఏవో నాలుగు ముక్కలు మాట్లాడుదామని అనుకునుండొచ్చు. అయితే ఏమి మాట్లాడుదామని అనుకున్నారో తెలీదు కానీ మాట్లాడింది మాత్రం ఏసు వర్ధంతే క్రిస్త్ మస్ అటూ పెద్ద బాంబు పేల్చారు. అంతటితో ఆగకుండా వీరారెడ్డి వర్ధంతి, ఏసు ప్రభువు వర్ధంతి ఒకేరోజు వచ్చాయని చెప్పటంతో కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఒక్కసారిగా నివ్వెరపోయారు.

 

అంటే ఫిరాయింపు మంత్రి ఉద్దేశ్యంలో వీరారెడ్డి, ఏసు ప్రభువు ఒకటే అనేమో తెలీదు. అందుకే వీరారెడ్డి వర్ధంతి రోజునే ఏసు ప్రభువు వర్దంతి కూడా వచ్చిందని చెప్పేశారు. ఆమధ్య నారా లోకేష్ కూడా డాక్టర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతికి తేడా తెలీకుండా మాట్లాడారు. అంటే నోటికేదొస్తే అది మాట్లాడేయటమే పనిగా పెట్టుకున్నారు మంత్రులు. ఏసు క్రీస్తు జన్మదినాన్ని క్రిస్త్ మస్ గా ప్రపంచమంతా జరుపుకోవటం కూడా మంత్ర ఆదినారాయణరెడ్డికి తెలీలేదంటే ఎంత విచిత్రంగా ఉందో అర్దమైపోతోంది. ఇటువంటి వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడేస్తే పోయేది వాళ్ళ పరువు కాదు ప్రభుత్వం పరువున్న  విషయం తెలుసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: