చంద్రబాబు అంటేనే రాజకీయం, ఆయన‌ ఊపిరి కూడా పాలిటిక్స్. ఆ సంగతి ఎవరిని అడిగినా చెప్పేస్తారు. రోజుకు ఇరవై నాలుగు గంటల సమయం ఉంటే దాదాపుగా ఎక్కువ సమయం బాబు రాజకీయాలకే కేటాయిస్తారు. దేశంలో ఈ విధంగా పాలిటిక్స్ ని ఇంతలా అమితంగా ప్రేమించే, శ్వాసించే నాయకుడు మరొకరు కనిపించరు. మరి అటువంటి బాబు రాజకీయ విరమణ అన్నది  జరిగే విషయమేనా 


జేసీ హాట్ కామెంట్స్ :


అనంతపురంలో జరిగిన ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు స్పీచ్ పక్కన పెడితే టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి పంచు డైలాగుల స్పీచ్ మాత్రం మాస్ కి ఓ కిక్కు ఇచ్చింది. మైకు అందుకుంటూనే జేసీ చంద్రబాబుని పొగుడుతున్నారో, విమర్శిస్తున్నారో తెలియనంతగా మాట్లాడుతూ పోయారు. కుట్రలను చేదించే  మొనగాడు బాబు అన్నారు. ఆయన కమ్మ కులం ఓట్లతోనే సీఎం కాలేదు అన్నారు. బాబు కు రాజకీయాలే ముఖ్యం అన్నారు. బాబు తలచుకుంటే దేశంలో  ఎవరైనా ఫినిష్ అన్నారు.  ఇవన్నీ వింటూ చంద్రబాబు నవ్వుతూ ఉండిపోయారు. కొన్ని సందర్భాల్లో జేసీ ఘాటెక్కించే కామెంట్స్ కి బాబు సైతం ఇరకాటంలో పడ్డారు.


వద్దు బాబోయ్ :


ఇక జేసీ మరో విన్నపం  ఏకంగా వేదిక మీద నుంచే బాబుకు చేశారు. ఎందుకొచ్చ్హిన ధర్మ పోరాట దీక్షలు  బాబూ. మీరు చెప్పేది జనాలకు ఎపుడో అర్ధమైపోయింది. ఇక మీరు పోరాట దీక్షలు  ఆపేయండి మహా ప్రభో అంటూ అందరి ముందూ అనేసరికి బాబుకు ఏం అనాలో పాలుపోలేదు. అంతటితో ఆగని జేసీ బాబు ఇలా ఎంతకాలం ఏపీలోనే ఉంటూ రాజకీయాలు చేస్తారు. మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఏపీ రాజకీయాలకు రిటైర్మెంట్ ఇవ్వండి. జాతీయ రాజకీయాల్లఒకి వెళ్ళండి, అక్కడ చక్రం తిప్పండి అంటూ సూచించారు.

ఇది పొగద్తో, మరేమిటో అర్ధం కాక బాబు సైతం విస్తుపోవాల్సివచ్చింది. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఏపీలోనే టఫ్ ఫైట్ ఉంది. జాతీయ స్థాయిలో ఏ కూటమి వస్తుందో తెలియదు, పీఎం పదవికి ఎంతో మంది పోటీ ఉన్నారు. బాబుకు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో అసలు తెలియదు, మరి వచ్చిన ఆ సీట్లను పెట్టుకుని ఆయన ఎలా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారో జేసీకే తెలియాలి. అంటే బాబు ఇంక రిటైర్ ఐపోవాలని అన్యాపదేశంగా జేసీ చెబుతున్నారా అన్న సెటిర్లు పడుతున్నాయి. మరి జేసీ వాచాలత్వం బాబుకు అర్ధం కాకుండా ఉంటుందా. అందుకే ఆయన బలవంతంగా నవ్వలేక నవ్వుతూ గడిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: