షెడ్యూల్ ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో చంద్రబాబునాయుడు సచివాలయం నిర్మాణం పేరుతో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి ఈరోజు శంకుస్ధాపన చేశారంటే ఏమిటర్ధం ? అందులోను  ఈ నిర్మాణాలను 6 నెలల్లో పూర్తి చేస్తారట. అంటే 2021కి డిసెంబర్ కు కానీ నిర్మాణాలు పూర్తికావు. అది కూడా షెడ్యూల్ ప్రకారం నిర్మాణాలు జరిగితేనే. రాఫ్ట్ టెక్నాలజీ పద్దతిలో చేస్తున్న నిర్మాణాలు దేశంలోనే మొదటిసారిగా చెప్పుకుంటున్న చంద్రబాబు నాలుగున్నరేళ్ళు ఏమి చేశారు ? అధికారంలోకి రాగానే నిర్మాణాలు ఎందుకు చేపట్టలేదు ?

 Image result for construction in raft technology

పోయిన ఎన్నికల్లో రాజధాని నిర్మాణం తనలాంటి అనుభవజ్ఞుడి వల్లే సాధ్యమని కదా జనాలను నమ్మించింది ? మళ్ళీ ఎన్నికలకు ముందుగాని సచివాలయం నిర్మాణాన్ని ఎందుకు మొదలుపెట్టలేదు ? ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో జనాలను మళ్ళీ మోసం చేయటానికే అని అర్ధమవుతోంది. రాజధాని నిర్మాణాలంటూ గ్రాఫిక్స్ మాయాజాలంతో జనాలను మోసం చేశారు. అదే పేరు చెప్పి జనాలను మళ్ళీ నమ్మించాలంటే సాధ్యంకాదు. అందుకనే సచివాలయం కోసం ఐకానిక్ టవర్ల నిర్మాణం పేరుతో కొత్త నాటకాలు మొదలుపెట్టారు.

 Image result for construction in raft technology

పైగా రాఫ్ట్ టెక్నాలజీ పేరుతో నిర్మాణాలు చేయటం దేశంలోనే మొదటిసారంటూ డప్పు కొట్టుకుంటున్నారు. కానీ చంద్రబాబు చెప్పింది తప్పు. ముంబాయ్, చెన్నై, బెంగుళూరు, కేరళ రాష్ట్రాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల రాఫ్ట్ టెక్నాలజీ పద్దతిలో నిర్మాణాలు జరిగాయి. రాఫ్ట్ టెక్నాలజీ అంటే మరేమీ లేదు. భూమి బలహీనంగా ఉన్న చోట్ల భారీ భవనాలను నిర్మాంచాలంటే మామూలు ఫౌండేషన్ వేయటానికి బదులు కాలమ్ ఫౌండేషన్ వేస్తారు. కాకపోతే ఈ పద్దతిని వాడటం బహుశా ఆంధ్రాలో మొదటిసారి కావచ్చేమో ? అంతదానికే దేశంలోనే మొదటిసారని, ప్రపంచంలోనే అత్యుత్తమ టెక్నాలజీ అంటూ ఒకటే ఊదరగొట్టేస్తున్నారు.

 Image result for construction in raft technology

అసలు అమరావతి ప్రాంతమే రాజధానికి పనికిరాదంటూ ఇంజనీరింగ్ నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు. ఎందుంకటే, అమరావతి ప్రాంతమంతా లూజ్ సాయిల్. లూజ్ సాయిల్లో భారీ నిర్మాణాలు చేయటం ఎంతమాత్రం క్షేమం కాదు. రాజధాని అన్నాక భారీ నిర్మాణాలు తప్పవు కదా ? అందుకనే అమరావతి ప్రాంతంలో భారీ నిర్మాణాలు వద్దని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నా చంద్రబాబు పట్టించుకోలేదు.

 

తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణాల పేరుతో ఇప్పటికే చంద్రబాబు వేల కోట్ల రూపాయల ప్రజాధనం డోచి పెట్టేశారు. అంత ఖర్చు పెట్టామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా చిన్న వర్షం కురిస్తే భవనాల్లో భారీగా లీకేజులు మొదలవుతాయి. రెండు భవనాల నిర్మాణాలే అంత సవ్యంగా జరిగితే ఇక లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే భవనాలు ఇంకెంత అందంగా ఉంటాయో చూడాల్సిందే. ఐదు టవర్లలో ఒకటి 50 అంతస్తులు ఉంటుందట. మిగిలిన నాలుగు టవర్లు తలా 40 అంతస్తులట. ఇపుడు మొదలుపెడుతున్న నిర్మాణాలను చూపే రేపటి ఎన్నికల్లో జనాలను ఓట్లడగాన్నది చంద్రబాబు వ్యూహం. చూద్దాం జనాలు ఏ విధంగా స్పందస్తారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: