అవును అందులో ఎటువంటి అనుమానాలు లేవు. షెడ్యూల్ ఎన్నికలకు మరో రెండు నెలల్లో నోటిఫికేషన్ వస్తున్న సమయంలో ఇపుడు రెండు భారీ ప్రాజెక్టులకు శంకుస్ధాపనలు చేయటంలో చంద్రబాబునాయుడు ఉద్దేశ్యమేమిటి ? రేపటి ఎన్నికలకు చంద్రబాబు కొత్త నాటకాలు మొదలుపెట్టటం కాకపోతే మరేమీ కాదు. అమరావతి ప్రాంతంలో సచివాలయం నిర్మాణానికి సంబంధించి ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణంతో పాటు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒకేరోజు శంకుస్ధాపనలు చేశారు. సచివాలయం నిర్మాణానికి వేల కోట్ల రూపాయలు కావాలి. అదే విధంగా ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి రూ 18 వేల కోట్లు అవసరం.

 Image result for iconic towers foundation stone

షెడ్యూల్ ఎన్నికలకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల కమీషన్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్ విడుదలైతే ప్రభుత్వ పరంగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, కొత్త పథకాలు ప్రకటించేందుకు లేదు. ఆ విషయాన్ని పక్కనుంచితే ఇఫుడు శంకుస్ధాపనలు చేసిన క్షేత్రస్ధాయిలో పనులు మొదలయ్యేందుకు కనీసం నెల రోజులు పడుతుంది. అంటే ఒకసారి నోటిఫికేషన్ విడుదలైందంటే ప్రభుత్వం పరంగా జరుగుతున్న పనులన్నీ స్లో అయిపోతాయి.

 Image result for iconic towers foundation stone

పైగా ఇపుడు చంద్రబాబు చేసిన శంకుస్ధాపన చేసిన రెండు కూడా భారీ నిర్మాణాలు కావు అతి భారీ నిర్మాణాలన్న విషయం గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం  చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఈ పరిస్ధితుల్లో సచివాలయం, ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ముందుకు జరిగే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి. అందుకనే పనులు జరుగుతున్నట్లుగా చంద్రబాబు ఏదో హడావుడి చేసి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేయటం ఖాయం. అందుకు చంద్రబాబు మీడియా తన వంతుగా ఎలాగూ సహకారం అందిస్తుందనటంలో సందేహం లేదు.

 Image result for steel factory foundation

అభివృద్ధి పనులు వేగంగా జరిగిపోతున్నట్లు వచ్చే ఎన్నికల్లో జనాలకు కలరింగు ఇవ్వటానికే ఇఫుడు శంకుస్ధాపనలు చేశారనటంలో సందేహమే లేదు. అందుకే టిడిపికి ఓట్లేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చంద్రబాబు మొదలుపెట్టారు. వైసిపికి ఓట్లేస్తే తాను చేస్తున్న అభివృద్ధి మొత్తం ఆగిపోతుందట. నిజానికి ఇపుడు చేసిన శంకుస్ధాపనలు రెండు కూడా నాలుగేళ్ళ క్రిందటే చేయాల్సింది. అంటే నాలుగేళ్ళు కాలయాపన చేస్తూ ఎన్నికల ముందు నాటకాలాడుతున్నారు. చంద్రబాబు జిమ్మిక్కులన్నీ జనాలకు తెలియనివేమీ కావు కదా చూద్దాం ఏం చేస్తారో ?


మరింత సమాచారం తెలుసుకోండి: