ప్రపంచంలో డ్రగ్స్ మహమ్మారి ఎంతో మంది యువత జీవితాలను నాశనం చేస్తున్న విషయం తెలిసిందే.  తక్కువ సమయంలో కోటీశ్వరులు కావాలనే కొరికతో ఉన్నవారు అక్రమ సంపాదనపై మొగ్గు చూపుతున్నారు.  డబ్బు కోసం ఎదుటి వారికి ఎంతటి ద్రోహం చేయడానికైనా వెనుకాడని పరిస్థితిలో ఉంటున్నారు.  డ్రగ్స్, హైటెక్ వ్యభిచారం, అక్రమాయుధాల సరఫరా లాంటివి చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు అండర్ వరల్డ్ మాఫియా. ఆ మద్య హైదరాబాద్ లో డ్రగ్స్ ఎంతటి కలకలం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ డ్రగ్స్ మాఫియా సభ్యులతో కొంత మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు, విద్యాసంస్థల అధినేతలకు సంబంధాలు ఉన్నాయని వార్తలు సంచలనం రేపాయి.
Image result for mumbai drugs catch
అంతే కాదు సిట్ ముందు కొంత మంది టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు.  ప్రతిరోజు ఎక్కడో అక్కడ డ్రగ్స్ వ్యాపారాన్ని కొనసాగించే వారిని పోలీసులు పట్టుకుంటునే ఉన్నారు.  తాజాగా ముంబై విమానాశ్రయంలో పోలీసులు భారీగా డ్రగ్స్‌ (మాదక ద్రవ్యాలు) పట్టుకున్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో వాడే నిమిత్తం ముంబైలో సిద్ధం చేసిన రూ. 1000 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు. వకోలా ప్రాంతంలో నిషేధిత డ్రగ్స్ విక్రయాలు సాగుతున్నాయన్న సమాచారంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ లో భాగమైన యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు దాడులు నిర్వహించారు.
Related image
దక్షిణాది రాష్ట్రాలు లక్ష్యంగా డ్రగ్స్‌ సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, పాండిచ్చేరిలలో డ్రగ్స్‌ సరఫరా చేసుందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్త సంవత్సర వేడులక సందర్భంగా డ్రగ్స్‌ను సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ దాడుల్లో పెద్దఎత్తున ఫెంటానిల్, హెరాయిన్, కొకైన్ లభ్యమయ్యాయి. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండుకు పంపామని, కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: