అనంతపురం టిడిపి ఎంపి జేసి దివాకర్ రెడ్డిపై వైసిపి నేతలు విరుచుకుపడ్డారు. అనంతరపుంలో చంద్రబాబునాయుడు గురువారం ధర్మపోరాట దీక్షలో పాల్గొన్న విషయం తెలిసిందే కదా ? ఆ దీక్ష సందర్భంగా జేసి మాట్లాడుతూ వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి నోటికొచ్చినట్లు మాట్లాడారు. సరే, జగన్ గురించి జేసి నోరుపారేసోవటం ఇదే మొదటిసారి కాదు. ఇదే చివరిసారి కూడా కాదేమో బహుశా. చంద్రబాబు మెప్పు పొందటం కోసం జగన్ ను ఇష్టమొచ్చినట్లు తిట్టటం జేసికి అలవాటే. అయితే, అనంతపురంలో జేసి మాట్లాడిన తీరుపై వైసిపి కోడూరు ఎంఎల్ఏ కోరుముట్ల శ్రీనివాసులు గట్టిగా రివర్స్ ఫిట్టింగ్ పెట్టారు.

 

నోటికొచ్చినట్లు మాట్లాడే జేసి దివాకర్ రెడ్డికి పందులకు తేడా ఏమీ లేదన్నారు. మొదటినుండి జగన్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం జేసికి అలవాటే అన్నారు. జగన్ ను నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న జేసిని తాము కూడా అదే స్ధాయిలో తిట్టగలమని చెప్పారు. అని చెబుతూనే జేసిని అసభ్యంగా తిడుతునే ఈ విధంగా తాము జేసిని తిట్టగలిగినా తిట్టమంటూనే మళ్ళీ తిట్టారు. రాయకూడని విధంగా జేసిని తిట్టిన ఎంఎల్ఏ భవిష్యత్తులో జేసి ఇదే విధంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.

 

కారణాలు స్పష్టంగా తెలీదుకానీ మొదటి నుండి జగన్ ను జేసి నోటికొచ్చినట్లు తిడుతునే ఉన్నారు. నిజానికి జేసి లాంటి సీనియర్ నేత చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడాల్సిన అవసరం లేదు. అనంతపురం జిల్లా వరకూ జేసి దివాకర్ రెడ్డి అడిగిన టిక్కెట్టు ఇవ్వటానికి చంద్రబాబు కూడా అభ్యంతరం చెప్పారు. అదే విధంగా తాడిపత్రి అసెంబ్లీ సీటు వరకూ జేసి కుటుంబాన్ని కాదని ఇంకోరికి కేటాయించే అవకాశం కూడా లేదు. పోటీ చేసే విషయంలో నియోజకవర్గాల్లో ఎటువంటి ఇబ్బంది లేకపోయినా జేసి దివాకర్ రెడ్డి మాత్రం చంద్రబాబు ముందు ఎందుకు సాగిలపడుతున్నారో అర్ధం కావటం లేదు. తాను సాగిలపడితే తప్పులేదు. కానీ చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేసేందుకు జగన్ ను నోటికొచ్చినట్లు తిడుతుండటమే  పెద్ద సమస్యగా మారింది. ఇంతకాలం వైసిపి నేతలే ఏదో సుతిమెత్తగా హెచ్చరించి వదిలేసేవారు. కానీ ఇపుడు మాత్రం అలా కాకుండా తీవ్రస్ధాయిలో రిటార్టు మొదలుపెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: