వైస్సార్సీపీ నాయకుడు జగన్ ఎన్నికలు దగ్గర పడుతుండటం తో అభ్యర్థుల లిస్ట్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు . ఒక పక్క పాదయాత్ర ను చేస్తూనే అభ్యర్థుల లిస్ట్ కోసం కసరత్తు చేశాడు.  అభ్యర్థులను ముందుగానే ప్రకటించి వారు తమతమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకునేలా వ్యూహ రచన చేస్తోంది. ఇందులో భాగంగా సంక్రాంతికి ముందే జనవరి 9న ఫస్ట్ లిస్టు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మొదటి  జాబితాలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడే 100 మంది అభ్యర్థులు, లోక్ సభకు పోటీ చేసే 10 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తయిందని తెలుస్తోంది.

Image result for jagan

ప్రస్తుతం జగన్మోహనరెడ్డి తన పాదయాత్రను శ్రీకాకుళం జిల్లాలో సాగిస్తున్నారు. పాదయాత్రలో ఇదే చివరి జిల్లా కావడంతో త్వరలో యాత్ర ముగియనుంది. యాత్ర ముగింపు జనవరి9న ఉండొచ్చని.. అదే రోజున అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుందని భావిస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీని రద్దు చేసీచేయగానే 105 మంది పేర్లతో తొలి జాబితా రిలీజ్ చేసింది. ఆ వెంటనే వారు పూర్తిగా ప్రచారంలో మునిగిపోయారు.

Image result for jagan

మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి చివరి వరకు అభ్యర్థుల విషయంలో మల్లగుల్లాలు పడుతూ సరిగా ప్రచారం చేసుకోలేకపోయింది. ఇవన్నీ చూశాక.. జగన్ కూడా ముందుగా అభ్యర్థులను ప్రకటించాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ నియోజకవర్గాలున్నాయి. ఇందులో పెద్దగా పోటీ లేనివి, తమకు పట్టున్నవి అయిన 100 అసెంబ్లీ, 10 లోక్ సభ నియోజకవర్గాలకు తొలి విడతలో అభ్యర్థులను ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. మిగతా వాటి విషయంలో కాస్త సమయం తీసుకోనున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: