చంద్రబాబునాయుడు ఎంత చేతకాని వాడో బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు చెబుతున్నారు. చంద్రబాబు సామర్ధ్యానికి జివిఎల్ మంచి ఉదాహరణ చెబుతున్నారు. ఏడాదికాలంలో కనీసం రెండస్తుల భవనం కూడా నిర్మించలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం చేసే దగా, మోసపూరిత రాజకీయాలకు హై కోర్టు విషయంలో ఏపి ప్రభుత్వం తీసుకున్న యుటర్న్ నిదర్శనంగా చెప్పారు. ఏపికి ప్రత్యేక హై కోర్టు కావాలని ఇన్ని రోజులు కేంద్ర న్యాయశాఖ చుట్టూ తిరిగిన టిడిపి ఎంపిలు విభజనకు కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వ్యతిరేకిస్తుండటం విచిత్రంగా ఉందన్నారు.


ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణ ఏపిలో పర్యటించేటపుడు హైకోర్టు పనులు డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని జివిఎల్ వివరించారు. హైకోర్టు విభజన విషయంలో చంద్రబాబు సుప్రింకోర్టులో డిసెంబర్ 15 కల్లా భవనాలు పూర్తి చేస్తామని అఫిడవిట్ ఫైల్ చేసిన విషయాన్ని కూడా జివిఎల్ గుర్తుచేశారు. చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ఆధారంగానే కేంద్రం హైకోర్టును విభజించిందన్నారు.

 

సుప్రింకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన చంద్రబాబు చివరకు ఏడాదిలో రెండస్తుల భవనాన్ని కూడా నిర్మించలేకపోయినట్లు మండిపడ్డారు. రెండస్తుల భవనాన్ని కూడా నిర్మించలేకపోవటం చంద్రబాబు చేతకాని తనానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని నిలదీశారు. అఫిడవిట్ లో పేర్కొన్నట్లు సకాలంలో భవనాలను పూర్తి చేయలని చంద్రబాబు ప్రభుత్వంపై కోర్టు ధిక్కారణ పిటీషన్ వేయాలని కూడా జివిఎల్ చెప్పటం గమనార్హం. ఏపిలో హై కోర్టు ఏర్పాటుకు సరైన వసతులు కూడా లేవు కాబట్టి హైకోర్టు విభజనకు మరింత సమయం కావాలని అప్పట్లో ఏపి బార్ కౌన్సిల్ కోరినా అప్పట్లో చంద్రబాబు ఒప్పుకోలేదన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: