తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచేస్తుందని ఓ వైపు పెదబాబు, చినబాబు గట్టి విశ్వాసంతో ఉన్నారు. అదే మాట పార్టీ మీటింగుల్లోనూ చెబుతున్నారు. మరో వైపు చూస్తే వాతావరణం వేరుగా ఉంది. తెలుగుదేశం సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న సినిమా వాళ్ళంతా పని గట్టుకుని మరీ వైసీపీకి జై కొడుతున్నారు. అంతే కాదు. అధినేతల కుటుంబ సభ్యులు సైతం ప్రత్యర్ధి పార్టీలోకే వెళ్తామంటున్నారు. మరి ఇదంతా దేనికి సంకేతం ?


హితైష్ చూపు అటే :


ప్రకాశం జిల్లాలో కీలకమైన నాయకునిగా ఉన్న చంద్రబాబు తోడల్లుడు, అన్న గారి అల్లుడు అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితైష్ చెంచురాం వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. ఆయన తన తండ్రికి సొంతమైన పరుచూరు అసెంబ్లీ సీటు నుంచి పోటీకి రెడీ అవుతున్నారు. హితైష్ లోకేష్ కి కజిన్. అంతే కాదు. ఇద్దరూ మంచి సన్నిహితులుగా ఉంటారు. దీంతో అంతా హితైష్ రాజకీయ ఆరంగేట్రం టీడీపీ నుంచే ఉంటునది భావించారు. కానీ చిత్రంగా హితైష్ వైసీపీ వైపు చూస్తున్నారుట.


కొడుకు కోసం :


ఇక దగ్గుబాటి తనకున్న పలుకుబడి, పరపతిని కుమారుని కోసం పెట్టుబడిగా పెడుతున్నారని టాక్. ఈ మధ్యన  తరచూ ఆయన పరుచూరు వెళ్ళి అక్కడ ఉన్న తన బలగాన్ని రేపటి రాజకీయం కొసం సిధ్ధం చేస్తున్నారుట. దగ్గుబాటికి చంద్రబాబుకు రాజకీయంగా పడదు. అయితే తన గురించి కాకుండా కుమారునికి నచ్చిన  పార్టీలోనే చేరమని చెప్పారట. అన్ని సమీకరణలు చూసుకున్నాక హితైష్ వైసీపీలోకే వెళ్ళాలనుకుంటున్నట్లుగా భోగట్టా

 ఇక తల్లి, దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. అంతకు ముందు ఆమె కాంగ్రెస్ లో చేరి మంత్రిగా కూడా పనిచశారు. విభజన తరువాత బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. బీజేపీకి  ఏపీలో పెద్దగా అవకాశాలు లేకపోయినా ఆమె మాత్రం పార్టీ మారేది లేదంటున్నారు. మళ్ళీ కేంద్రంలో మోడీ సర్కారే వస్తుందని అంతా నమ్ముతున్న వేళ ఆమె రాజ్యసభకైనా వెళ్తారని అంటున్నారు. దాంతో హితైష్ సొంతంగా రాజకీయం చేస్తున్నారని, ఆయన వైసీపీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతోంది. మంచి  రోజు చూసుకుని వైసీపీలోకి హితైష్ వస్తారని అంటున్నారు. మరి ఈ పరిణామం టీడీపీకి దెబ్బేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: