చంద్ర బాబు ను రాజకీయంగా వెంటాడుతున్న నింద వైస్రాయ్ ఎపిసోడ్.  ప్రతి పక్ష నాయకులు దీనిని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారు. అయితే రెండు రోజుల నుంచి ఇరు రాష్ట్ర ముఖ్య మంత్రులు విమర్శలు కురిపించుకుంటున్నారు. సహజంగా మాటకారి అయిన కేసీఆర్ ఎప్పటికపుడు బాబుపై పైచేయి సాధిస్తున్నాడు. నిన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ అభ్యంతరకరమైన భాష కూడా వాడి చంద్రబాబును ఎడాపెడా తిట్టాడు. అంతేనా... చంద్రబాబు తన జీవిత కాలంలో సాధించింది జీరో అనేశాడు.

Image result for kcr

తనకు తెలిసిన కొన్ని సాక్ష్యాలు చెబుతూ చంద్రబాబు గాలి తీసే ప్రయత్నం చేశాడు. సాధారణంగా కేసీఆర్ ఏమైనా అంటే వెంటనే రిటార్ట్ ఇచ్చే చంద్రబాబు నిన్న కేసీఆర్ ఇచ్చిన సాక్ష్యాధార రహిత విమర్శలకు ఏం పాలుపోక 24 గంటల తర్వాత స్పందించారు. దీంతో... ఏదేదో చేయబోయి ఇంకేదో మాట్లాడేశారు. చివరకు జీవిత కాలం తాను మోస్తున్న ఒక నిందను కేసీఆర్కు అంటించే ప్రయత్నం చేశారు. కాకపోతే దానివల్ల కేసీఆర్ కు పెద్ద నష్టం లేదు గాని మరోసారి తను చేసిన తప్పు చంద్రబాబే స్వయంగా జనాలకు చెప్పినట్లయ్యింది.

Image result for chandra babu

ఇప్పటికీ చంద్రబాబును వెంటాడుతున్న ఆ రాజకీయ మచ్చ తరచూ ప్రత్యర్థులకే పెద్ద అస్త్రంగా ఉపయోగపడుతోంది. అయితే అది తనను వదిలేలా లేదని ఫిక్సయిన కేసీఆర్ అందులో కేసీఆర్ ను ఇన్వాల్వ్ చేసారు. వైస్రాయ్ హోటల్ వ్యవహారంలో నేను పాత్రధారిని - కానీ సిద్ధాంతకర్త - వ్యూహకర్త కేసీఆరే అని ఆరోపించారు. ఆ ఎపిసోడ్ తోనే కేసీఆర్ మంత్రి అయ్యారని చెప్పారు.ఈ మాటతో బాబు  రెండు పొరపాట్లు చేశారు. ఒకటి... ఎన్టీఆర్ ను తన పదవి కోసమే దింపాను అని ఒప్పేసుకోవడం ఒకటి - రెండో దానికి సాయం చేసినందుకు కేసీఆర్ కు మంత్రి పదవి గిఫ్ట్ ఇవ్వడం ఒకటి.  అంటే కేసీఆర్ కు కౌంటర్ ఇవ్వబోయి తనను తాను బాబు ఇరికించేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: