రాష్ట్ర విభజన చేయమని నేనే చెప్పా...

ఎన్టీయార్ ను నుండి పార్టీని లాక్కున్నా...

హరికృష్ణ మృతదేహం ముందే పొత్తుల గురించి మాట్లడా...

 

ఇవన్నీ ఏమిటో అనుకుంటున్నారా ? చంద్రబాబునాయుడు అంగీకరించిన సత్యాలు. పైవిషయాలను చంద్రబాబు తనంతట తానుగా ఒప్పుకున్న వాస్తవాలు. మామూలుగా అయితే ఏ వాస్తవాన్ని కూడా ఒప్పుకునే అలావాటు చంద్రబాబుకు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటి విషయాలో అవసరం లేదు. ఈమధ్యనే అందరికీ తెలిసిన వాస్తవం ఓటుకునోటు కేసు తీసుకున్నా చాలు. ఓటుకునోటు కేసులో తెరవెనుక సూత్రదారి చంద్రబాబే అన్న విషయం అందరికీ తెలుసు. కెసియార్ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని వేసిన భారీ స్కెచ్ బూమరాంగ్ అయి చివరకు పదేళ్ళ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ను ఏడాదికే వదులుకుని విజయవాడకు పారిపోయిన ఘనడు చంద్రబాబు. ఆ కేసు గురించి చర్చ వచ్చినప్పుడల్లా తనకేం సంబంధమని బుకాయిస్తున్న వ్యక్తి చంద్రబాబు.

 Image result for ap state bifurcation agitation

ప్రపంచానికంతా తెలిసిన విషయాన్ని కూడా బుకాయిస్తున్న చంద్రబాబు మూడు విషయాల్లో మాత్రం వాస్తవాలను అంగీకరించటమే ఆశ్చర్యంగా ఉంది. అవికూడా బాగా కాంట్రవర్షియల్ అంశాలే పైగా. మొదటిది రాష్ట్ర విభజన గురించి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని యూపిఏ ప్రభుత్వం అడ్డుగోలుగా విభజించిందని చాలా కాలంగా మండిపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది రాష్ట్ర విభజన చేయమని తానే చెప్పినట్లు అంగీకరించటం గమనార్హం. మరి అలా ఎందుకు అంగీకరించారో ఎవరికీ అర్ధం కావటం లేదు.

 Image result for ntr viceroy incident

ఇక రెండో అంశం చూద్దాం. ఎన్టీయార్ నుండి తెలుగుదేశంపార్టీని లాక్కున్నట్లు అంగీకరించారు. అధికార మార్పడి అనే పాలిష్ డు పదాలను వాడినా జరిగింది మాత్రం  వెన్నుపోటే. ఆ విషయం ప్రపంచానికంతా  తెలుసు. కానీ చంద్రబాబు మాత్రం ఎప్పుడు ఆ విషయాన్ని మాట్లాడలేదు. అలాంటిది కెసియార్ పన్నిన ఉచ్చులో ఇరుక్కున్న చంద్రబాబు అనాలోచితంగా ఒప్పేసుకున్నారు. ఎన్టీయార్ నుండి చంద్రబాబు పార్టీని లాక్కున్నారంటూ కెసియార్ ఆరోపించిన విషయం తెలిసిందే. దానికి చంద్రబాబు సమాధానమిస్తూ ఎన్టీయార్ నుండి తాను టిడిపిని లాక్కున్నపుడు కెసియార్ ఎక్కడున్నారంటూ నిలదీశారు. అంటే తాను ఎన్టీయార్ నుండి పార్టీని లాక్కున్నట్లు నోరుజారారు.

 Image result for harikrishna death ktr and chandrababu

ఇక మూడో విషయం ఏమిటంటే, హరికృష్ణ మృతదేహం దగ్గరే టిఆర్ఎస్, తెలుగుదేశంపార్టీల పొత్తుల గురించి మాట్లాడటం. ఈ విషయాన్ని మొదట బయటపెట్టింది కెటియార్. తెలంగాణా ఎన్నికల గురించి మాట్లాడుతూ హరృష్ణ మృతదేహం ముందే తమతో చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారంటూ మండిపడ్డారు కెటియార్. అయితే ఆ విషయంపై పెద్దగా స్పందించిన చంద్రబాబు తాజాగా మాట్లాడుతూ, అవును హరికృష్ణ మృతదేహం వద్ద పొత్తుల గురించి మాట్లాడాను తప్పా ? అంటూ సమర్ధించుకునేందుకు ప్రయత్నించారు.  సరే, సమర్ధింపులు ఎలాగున్నా పొత్తుల గురించి మృతదేహం వద్దే ప్రతిపాదించిన విషయాన్ని ఒప్పేసుకున్నారు. అదికూడా కెసియార్ అమ్మనాబూతులు తిట్టిన నేపధ్యంలోనే సుమా.

 Image result for cash for vote telangana

విషయం చూస్తుంటే చంద్రబాబు ఒప్పుకున్న వాస్తవాలే రేపటి ఎన్నికల్లో చంద్రబాబు మెడకు చుట్టుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఎందుకంటే, ఇపుడు చంద్రబాబు అంగీకరించిన వాస్తవాలనే ప్రతిపక్షాలు తమ ఎన్నికల ప్రచార ఆయుధాలుగా వాడుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పైగా చంద్రబాబుకు కెసియార్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. చంద్రబాబుతో కలిసి ఎన్టీయార్ ను దింపటంతో పాత్రున్నా కెసియార్ వరకూ పెద్దగా ఇబ్బంది పెట్టే అంశంకాదు. ఎందుకంటే, ఏపిలో కెసియార్ ఏమీ పోటీచేయబోవటం లేదు. పైగా కెసియార్ ఏమీ ఎన్టీయార్ కు అల్లుడు కాదు. కానీ చంద్రబాబు విషయం మాత్రం వేరు. కాబట్టి కెసియార్ పన్నిన ఉచ్చులో చంద్రబాబు బాగానే ఇరుక్కున్నట్లు అర్ధమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: