రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్.. ఆ పదవిలో ఎక్కువకాలం కొనసాగరనే వార్తలు గుప్పుమంటున్నాయి. వచ్చే ఏప్రిల్ లో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేసీఆర్ జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెడతారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు.. ఆయన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..?

 Image result for kcr trs

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘన విజయం సాధించింది టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం కూడా చేసేశారు. అయితే ఆయన ఆ పదవిలో కొంతకాలం మాత్రమే ఉంటారని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. త్వరలోనే ముఖ్యమంత్రి బాధ్యతలను కేటీఆర్ కు అప్పగించి.. కేసీఆర్ ఢిల్లీకి వెళ్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఆయన కార్యాచరణ ఉండబోతోంది. అయితే కేసీఆర్ ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తనకు అచ్చొచ్చిన కరీంనగర్ నుంచి పోటీ చేస్తారా... లేక దీక్షను మలుపుతిప్పిన ఖమ్మం నుంచి చేస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 Image result for kcr trs

కరీంనగర్ నుంచి కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉద్యమాన్ని ముందుకు నడిపించేందుకు కరీంనగర్ అందించిన ప్రోత్సాహం మరువలేనిది. ఎన్నికలకు వెళ్లిన ప్రతిసారి కేసీఆర్ ఇక్కడ గెలిచారు. ఉద్యమాన్ని సజీవంగా నిలపగలిగారు. ఇప్పుడు ఉద్యమం అవసరం లేదు. ప్రత్యేక రాష్ట్రం సాకారమైంది. ఓ విడత అధికారం పూర్తియి.. రెండో విడత అధికార పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి పెట్టారు. అందుకే మరోసారి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కరీంనగర్ నుంచి మళ్లీ బరిలోకి దిగాలనుకుంటున్నట్టు పార్టీ అంతర్గత సమాచారం.

 Image result for kcr trs

అయితే.. కరీంనగర్ నుంచి మాత్రమే కాకుండా మిగిలిన ప్రాంతాల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనేదానిపైన కూడా కేసీఆర్ సమాచాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లా కొరకరానికొయ్యగా మారింది. ఇంతటి ఊపులో కూడా అక్కడ టీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఇక్కడి నుంచి బరిలోకి దిగితే పార్టీకి మంచి ఊపు లభిస్తుందని పార్టీ శ్రేణుల నుంచి సూచనలు వస్తున్నాయి. దీనిపైన కూడా కేసీఆర్ దృష్టి పెట్టారని తెలుస్తోంది. అంతేకాక.. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని ఓ స్థానం నుంచి పోటీ చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం బలంగా ఉండడమే ఇందుకు కారణం. ప్రత్యర్థుల కంచుకోటలను బద్దలు కొట్టేందుకు నేరుగా కేసీఆరే బరిలోకి దిగితే బాగుంటుందని పార్టీ శ్రేణుల నుంచి సూచనలు వస్తున్నాయి. మరి కేసీఆర్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతారనేది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: