మరి కొద్ది గంటల్లో 2018 చరిత్రలోకి వెళ్ళిపోతోంది. కాలగర్భంలో క్యాలండర్ కలసిపోతోంది. కొత్త ఒక వింత అన్నట్లుగా 2019 నూతన‌ వికాసంతో  రాబోతోంది. ఈ ఏడాది ఆషామాషీది కానే కాదు. మిగిలీన ఏడాది మాదిరి అంతకంటే కాదు. 2014కి చెల్లి ఈ ఏడాది. అంటే ఎన్నికల ఏడాది అన్న మాట. కొత్త సంవత్సరం ఎవరికి రాజుని చేస్తుందో చూడాలి.


బాబు ధీమా:


వచ్చే 2019 తనను మళ్ళీ సీఎం సీటులో కూర్చోబెడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమాగా ఉన్నారు. ఈ ఏడాది తనకు అన్ని విధాలుగా కలసివస్తుందని కూడా ఆయన నమ్ముతున్నారు. ఓ వైపు అభివ్రుధ్ధి, మరో వైపు సంక్షేమం నమ్ముకున్న చంద్రబాబు ఏపీలో ప్రతి కుటుంబానికి కొన్ని మేళ్ళు అయినా చేశానన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. అందువల్ల అవే రేపటి ఎన్నికల్లో తనకు ఓట్లు తెచ్చిపెడతాయని ఆయన భావిస్తున్నారు. అంతే కాదు, తన అనుభవంతో సరిపడ నాయకుడు ప్రత్యర్ధి పార్టీల్లో లేకపోవడం తనకు ప్లస్ పాయింటుగా పేర్కొంటున్నారు. 


అందలం ఎక్కించేదే:


వస్తున్న 2019 సంవత్సరం 2014 మాదిరిగా తనను మోసం చేయదని వైసీపీ అధినేత జగన్ గట్టిగా నమ్ముతున్నారు. ఈసారి కచ్చితంగా తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటానని జగన్ బలమైన విశ్వాసంతో ఉన్నారు. దాదాపుగా 14 నెలల పాటు చేసిన పాదయాత్రతో జగన్ లో కొత్తగా నమ్మకం ఏర్పడింది. జనాలను దగ్గరగా చూసిన ఆయనకు వేరే సర్వేలు అవసరం లేదనిపిస్తోంది. వారి గుండె చప్పుడుని దగ్గర ఉండి ఆలకించిన జగన్ కి ఇక తనకు అధికారం అప్పగిస్తారన్న ధీమా కూడా ఏర్పడింది. అధికార పక్షం చేసిన తప్పులతో పాటు, తన పార్టీకు జనంలో ఉన్న ఆదరణ, వైఎస్సార్ పట్ల నమ్మకం. తన పట్ల అభిమానం అన్నీ కలసి వైసీపీని గద్దెనెక్కిస్తాయని జగన్ భావిస్తున్నారు.


పవన్ ఆశలు :


ఈసారి వచ్చే 2019 అన్ని కొత్త ఏడాదిల మాదిరి కాదు అన్నది జనసేనాని పవన్ కళ్యాణ్ నమ్మకం. అవన్నీ ఆయన సినీ హీరోగా మెట్టు ఎక్కిస్తే 2019 జన నాయకునిగా నిలబెడుతుందని పవన్ గట్టిగా భావిస్తున్నారు. ఈ ఏడాది చేసే మ్యాజిక్ తనకే అనుకూలంగా మారుతుందని పవన్ తో పాటు జనసైనికులు కూడా బలంగా భావిస్తున్నారు. జనసేన అనూహ్య విజయం దక్కించుకుంటుందని, రాబోయే కాలమంతా తమదేనని జనసైనికులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: