ఫిరాయింపు మంత్రి భూమా అఖిలప్రియ చేసిన తాజా హెచ్చరికలు జిల్లాలో పెద్ద కలకలమే రేపుతోంది. తన ప్రత్యర్ధులందరికీ కలిపి అఖిల ఒకేసారి వార్నింగ్ ఇచ్చేశారు. మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది లేండి. ఆ సందర్భంగా ఫిరాయింపు మంత్రి మాట్లాడుతూ, తనను ఓడించటానికి ప్రత్యర్ధులందరూ ఏకమవుతున్నట్లు మండిపడ్డారు. ఎంతమంది తనకు వ్యతిరేకంగా ఏకమైనా తనను ఓడించలేరని చాలెంజ్ కూడా చేశారు. తాను గెలిచిన తర్వాత ఒక్కోళ్ళ సంగతి చెబుతానంటూ సివియర్ వార్నింగ్ కూడా ఇచ్చారు. నిజానికి మొన్నటి వరకూ పార్టీలోనే ఉన్న సీనియర్ నేత ఇరిగెల రాం పుల్లారెడ్డి టిడిపికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అఖిల భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతోందని, ఆమె ఆగడాలు భరించలేకే తాను రాజీనామా చేస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు.

 

అదే సమయంలో పార్టీలోనే ఉన్న ఏవి సుబ్బారెడ్డితో ఫిరాయింపు మంత్రికి ఏమాత్రం పడటం లేదు. వచ్చే ఎన్నికల్లో మంత్రి నియోజకవర్గమైన ఆళ్ళగడ్డలో పోటీ చేయటానికి ఏవి పావులు కదుపుతున్నారు. దాంతో మంత్రి, ఏవికి మధ్య పచ్చగడ్డి వేయకపోయినా భగ్గు మంటోంది. అదే సమయంలో పార్టీలో ఉన్నంత వరకూ ఇరిగెల కూడా అయితే ఆళ్ళగడ్డ లేకపోతే నంద్యాలలో పోటీకి సై అంటుండేవారు. ఎప్పుడైతే ఇరిగెల పార్టీలో నుండి బయటకు వచ్చేశారో తర్వాత ఏపి, ఇరిగెల కలిసినట్లున్నారు. అందుకనే ఫిరాయింపు మంత్రి ఉలిక్కిపుతున్నారు. నిజానికి ఏపి, ఇరిగెలకు బలమైన సొంతవర్గముంది. వారిద్దరూ నిజంగానే అఖిలకు వ్యతిరేకంగా కలిస్తే అఖిల గెలుపు అంత ఈజీకాదు.

 

అందుకే ఇపుడు ఫిరాయింపు మంత్రిలో టెన్షన్ మొదలైంది. కానీ బయటకు కనబడకుండా ప్రత్యర్ధులకు వార్నింగులు ఇస్తున్నారు. నంద్యాల, ఆళ్ళగడ్డ నియోజకవర్గాల్లో గెలిచి చంద్రబాబునాయుడుకు కానుకగా ఇస్తున్నట్లు కూడా ప్రకటించేశారు. అందులో భాగంగానే తాను గెలిచిన తర్వాత ప్రత్యర్ధుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని కూడా తీవ్రంగానే హెచ్చరించారు. తన ప్రత్యర్ధులెవరో కూడా తనకు తెలుసంటూ చేసిన ఘాటు వ్యఖ్యలు పార్టీలు కలకలం రేపుతున్నాయి. మరి ప్రత్యర్ధులెవరో ? వారిని అఖిల ఏం చేస్తారో చూడాలంటే కొంత కాలం ఆగకతప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: