తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అటు ప్రత్యర్థి పార్టీలతో  ఇటు కేంద్రంతో పోరాడుతూ పాలనలో తనదైన శైలిలో కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తీవ్ర దెబ్బతినడంతో ఆ రాష్ట్రంలో ఉన్న టీడీపీ క్యాడర్ ఇప్పటికే వేరే పార్టీల వైపు చూస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.

Image result for chandrababu

దీంతో పరిస్థితులన్నీ గమనించిన చంద్రబాబు రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి ఏపీలో రాకూడదని ఎన్నికలకు ముందు అన్ని విధాల పార్టీని పటిష్ట పరుస్తూ ఆంధ్రాలో అభివృద్ధిని కొనసాగించడానికి నడుం బిగించారు.

Related image

ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతంలో అతి తక్కువ ఓటుబ్యాంకు గెలుచుకున్న చంద్రబాబు రాబోయే ఎన్నికలలో రాయలసీమ ప్రాంతంలో అత్యధిక సీట్లు గెలవాలని లోహాలు ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నారు.

Related image

ఈ నేపథ్యంలో తాజాగా ఏపి సిఎం చంద్రబాబు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో మెగా పారిశ్రామిక హబ్‌కు 12,203 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దానితో పాటు మెగా సీడ్ పార్కు కోసం 650 ఎకరాలు, కడపలోని మెగా పారిశ్రామిక పార్కు కోసం 6,553 ఎకరాలు కేటాయించనున్నట్లు ఆయన ప్రకటించారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని, పారిశ్రామిక విద్యుత్ వినియోగం రెట్టింపు అయిందని అన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: