సినీ యాక్టర్ శివాజీ చాలాకాలం తర్వాత మళ్లీ స్క్రీన్ పైకి వచ్చారు. మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి ఏదో ఒక సెన్సేషన్ సృష్టించే శివాజీ ఈసారి కూడా అలాంటి సంచలనాలతోనే వచ్చారు. చుక్కల భూములు, ఎన్టీఆర్ బయోపిక్.. తదితర అంశాలతో శివాజీ ప్రెస్ మీట్ హాట్ హాట్ గా సాగింది. విజయవాడలో జరిగిన శివాజీ ప్రెస్ మీట్ లో సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై సంచలన కామెంట్స్ చేశారు.

 Image result for sivaji on rgv

రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం లక్ష్మీఎస్ ఎన్టీఆర్ అనే పేరుతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మిపార్వతి ఎంటర్ అయిన తర్వాత స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందనే విషయం తెలిసిందే. ఇప్పటేకే దీనికి సంబంధించిన ఓ ఆడియా సాంగ్ ను కూడా రిలీజ్ చేశాడు వర్మ. ఈ పాట ఇప్పటికే తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మపై శివాజీ సీరియస్ కామెంట్స్ చేశారు. వెన్నుపోటుకు, వెన్నుదన్నుకు తేడా ఏంటో వర్మకు తెలీదన్నారు శివాజీ.

 Image result for viceroy hotel ntr

చంద్రబాబు నాయుడు రామారావుని వెన్నుపోటు పొడిచాడనే నేపథ్యంలో వర్మ సాంగ్ రిలీజ్ చేశాడని శివాజీ అన్నారు. తను వైసీపీకి చెందిన వాడినని కూడా అంగీకరించారన్నారు. రాముడు వాలిని చంపిన సందర్భం వేరు.. చంద్రబాబు రామారావు నుంచి పార్టీని కాపాడుకున్న సందర్భం వేరు అన్నట్టు శివాజీ చెప్పుకొచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఎన్టీఆర్ – లక్ష్మిపార్వతిల నేపథ్యాన్ని చూపించాలన్నారు. టీడీపీని కబ్జా చేసేందుకు లక్ష్మీపార్వతి ప్రయత్నిస్తున్న సమయంలో పార్టీని కాపాడుకునేందుకు చంద్రబాబు, కేసీఆర్ సహా యావత్ పార్టీ నేతలూ అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారని శివాజీ వివరించారు.

 Image result for lakshmis ntr

నాడు వైస్రాయ్ హోటల్ వద్ద చైతన్యరథంపై చెప్పులు విసిరింది లక్ష్మిపార్వతి మనిషేనని శివాజీ చెప్పారు. ఇందుకు తానే ప్రత్యక్ష సాక్షినని చెప్పారు. కావాలంటే ఇందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో చూసుకోవచ్చన్నారు. నాడు చంద్రబాబు పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి కాపాడారాన్నారు. అందుకే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు పూర్తి మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ఒకవేళ అది వెన్నుపోటు అని ప్రజలు భావించి ఉంటే చంద్రబాబుకు అధికారం కట్టబెట్టేవారా.. అని ప్రశ్నించారు.

 Image result for sivaji

అంతేకాదు.. నేడు బీజేపీ జాతీయ స్థాయిలో నిలబడిందంటే అందుకు కారణం చంద్రబాబేనన్నారు. చంద్రబాబు మద్దతు లేకుంటే వాజ్ పేయి రెండోసారి ప్రధానమంత్రి అయ్యేవారు కాదన్నారు శివాజీ. నాడు వాజ్ పేయి ప్రధాని కాకుంటే పార్టీ ఈరోజు ఈ స్థాయిలో ఉండేది కాదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: