జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ విశాఖపట్నం సెంట్రల్ జైలులో చాలా కులాసాగా గడుపుతున్నాడు. నిందితుడిని జైలు అధికారులు కొత్త అల్లుడు లాగ చూసుకుంటున్నట్లు జగన్ మీడియా చెబుతోంది. మూడు పూటలు బిర్యానీలతో పాటు అడిగిన నాన్ వెజ్ టేరియన్ వంటకాలను అందిస్తున్నారట. అంతేకాకుండా శ్రీనివాస్ పనులు చేసి పెట్టటానికి ముగ్గురు వ్యక్తిగత సహాయకులను కూడా నియమించారట. చూశారో జగన్ పై దాడి చేసిన వ్యక్తికి జైలులో ఎంతటి రాచమర్యాదలు జరుగుతున్నాయో ?

 

ఇతర ఖైదీలు లాగ జైలులో కేటాయించిన పనులు చేయాల్సిన అవసరం లేదు. తన గదిని తాను శుభ్రం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదట. చివరకు తన బట్టలు కూడా బహుశా వ్యక్తిగత సహాయకులే ఉతికుతున్నారేమో ? కాలక్షేపానికి కాలక్షేపం..రోజు అందుతున్న రాచమర్యాదలు. ఇంకేం కావలి నిందితుడు శ్రీనివాస్ కు. బహుశా క్యాంటిన్లో పనిచేసేటపుడు కానీ అంతకుముదు కానీ ఇటువంటి లగ్జరీ జీవితాన్ని శ్రీనివాస్ అనుభవించి ఉండడేమో. జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడికి శిక్ష పడుతుందో లేదో తెలీదు కానీ ప్రస్తుతానికైతే కొత్త అల్లుడికి లాగ జైలు అధికారులు మర్యాదలు చేస్తున్నారట.

 

ఇతర ఖైదీలెవరినీ శ్రీనివాస్ తో మాట్లాడేందుకు లేకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారట. కేటాయించిన వ్యక్తిగత సహాయకులు కూడా తెలుగు వచ్చిన వారు కాదు. బీహార్, ఒడిస్సాలకు చెందిన భాయ్, జలీల్, మిథున్ లను కేటాయించారట. ఎందుకంటే, జగన్ పై దాడి విషయం వెనుకున్న సూత్రదారులు, పాత్రదారుల గురించి నిందితుడు పొరపాటున నోరు జారితే కష్టమన్న ఉద్దేశ్యంతోనే తెలుగు వచ్చిన ఖైదీలెవరినీ నిందితుడి దగ్గరకు రానీయటం లేదట. శ్రీనివాస్ బాధ్యతలను డిప్యుటి సూపరెండెంట్ స్ధాయి అధికారికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారని సమాచారం. చూశారా జైలు జీవితమంటే ఎంత కఠినంగా ఉంటుందో అనుకుంటాం. ఇక్కడ చూస్తే నిందితుడికి వివిఐపి ట్రీట్మెంట్ అందుతోంది. చూద్దాం ఎంత కాలం ఇలా సాగుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: