చంద్ర బాబు పవన్ ను తన పార్టీ తో కలవమని ఆహ్వానించడం టీడీపీ శ్రేణులను కూడా కలవర పెట్టింది. అయితే దీని వెనుక బలమైన కారణం ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ స్థానాలు దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వస్తుందనే వాదన మొదటి నుంచి ఉంది. 2014లో పవన్ మద్దతు కారణంగా ఈ జిల్లాల్లో టీడీపీ ఎక్కువ సీట్లు దక్కించుకుంది.

 రెండు రోజులుగా కన్ఫ్యూజన్

ఇక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో సర్వేలు చేసి అందరికీ టిక్కెట్లు ఇస్తానని చంద్రబాబు చెబుతున్నారు. అలాగే, చాలా రోజులుగా ఆయన అంతర్గతంగా సర్వేలు కూడా చేయించుకుంటున్నారు. పవన్ దూరమైతే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో భారీగా దెబ్బ పడి టీడీపీ నష్టపోతుందని తేలి ఉంటుందని అంటున్నారు. ఈ కారణంగానే మళ్లీ పవన్ పాట పాడుతున్నారని చెబుతున్నారు.

 చంద్రబాబుకు జనసేనాని గట్టి షాక్

నిన్నటి వరకు పవన్‌ను కూడా మోడీకి లంకె పెట్టారు. ఇప్పుడు అలా చెప్పడం లేదు. పవన్ దూరమైతే జగన్‌కు లాభిస్తుందని, అంతేకాకుండా కేసీఆర్, జగన్‌లు ఒక్కటిగా ఉంటారనే ఉద్దేశ్యానికి తోడు, తన సర్వేలో జనసేన దూరం జరిగితే నష్టమని తేలడంతో ఇలా మాట్లాడారా అనే చర్చ సాగుతోంది. అయితే పవన్ మాత్రం బాబు బుజ్జగింపులకు తలొగ్గలేదు. తాము వామపక్షాలతో మినహా ప్రధాన, విపక్షాలతో కలిసేది లేదని తేల్చి చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: