ఇప్పడూ ఏపీ లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీ  జనసేన పొత్తు గురించి వార్తలు ఇప్పటి వరకు తెగ హల్ చల్ చేశాయి. మొత్తానికి పవన్ ట్వీట్ తో క్లారిటీ ఇచ్చాడు. అయితే చంద్ర బాబు తన తో పవన్ ను పొత్తుకు ఆహ్వానించడం వెనుక జనసేనకు వచ్చే సీట్ల సంఖ్యలో బాబు కు క్లారిటీ వచ్చి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే 2014లోని ఓటు బ్యాంకు చీలిపోయి తమకు లాభిస్తుందని వైయస్ జగన్ కూడా లెక్కలు వేసుకుంటున్నారట. పవన్ తమతో రావడం విషయం పక్కన పెడితే, టీడీపీతో కలిసి వెళ్లకపోవడం మాత్రం ఊరట కలిగించేదని భావిస్తున్నారట.  

ఆ క్రెడిట్ పంచే ఉద్దేశ్యం లేదు

చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతో ఈసారి ప్రజలు తమకు ఓటు వేస్తారని జగన్ గట్టి విశ్వాసంతో ఉన్నారట. కాబట్టి జనసేన, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల పొత్తుపై జగన్ కూడా ఆలోచన చేయడం లేదట. జనసేనతో కలిసి పోటీ చేసి, గెలిచాక.. గెలుపు క్రెడిట్ పవన్‌కు పంచడం ఆయనకు ఇష్టం లేదట. అదే సమయంలో ఒంటరిగా పోటీ చేస్తున్నందుకు వైసీపీ సంబరపడుతోందట. గతంలో తమకు ఓట్లు వేసిన వారికి తోడు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నవారు తమ వైపు మరలుతారని, పవన్ ఒంటరిగా పోటీ చేస్తే, నాటి అధికార పార్టీ అనుకూల ఓట్లు చీలుతాయని భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఒంటరి పోరు వల్ల ఎవరికి నష్టమంటే?

పవన్ ఒంటరి పోరు వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందని చెబుతున్నారు. అది వైసీపీ అధికారంలోకి రావడానికి మరింత ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఒంటరి పోరు చేస్తున్న పవన్‌కు వైసీపీ థ్యాంక్స్ చెప్పాలని అంటున్నారు.  టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏపీలో సర్వేలు చేయగా, జనసేనకు 15 సీట్లు వస్తాయని తేలిందని తెలుస్తోంది. అలాగే 5 శాతం నుంచి 25 శాతం ఓట్లు వస్తాయని తేలిందట. ఇది టీడీపీకి పడే దెబ్బ అంటున్నారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం నేత. ఆయన కులానికి దూరంగా ఉన్నప్పటికీ, 2014లో ఆయనను చూసే ఓటు వేశారు. ఇప్పుడు వారి ఓట్లు జనసేనకు పడితే టీడీపీకే నష్టం. ఇది గమనించే చంద్రబాబు మళ్లీ యూటర్న్ తీసుకున్నారని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: