తమ తో పొత్తు కు రావాలని చంద్ర బాబు జనసేన ను ఆహ్వానించేసరికే జనసేన వర్గాలు ఒక్క సారిగా ఉలిక్కి పడ్డారు. దీనితో జనసేన అధినేత వెంటనే స్పందించాడు. అయితే టీడీపీ దుష్ప్రచారంపై పవన్ చాలా సున్నితంగా స్పందించాడనేది జనసేన వర్గాల ఆరోపణ. ఈ డోస్ సరిపోదని సాక్షాత్తూ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూనే ఆయన్న ఉతికి ఆరేస్తాడని ఎదురుచూసిన జనసేన టీమ్, పవన్ వ్యాఖ్యలపై ఏమంత సంతృప్తి కనబరచలేదు.

Image result for pavan janasena

ట్విట్టర్ లో స్పందించడంతో పాటు, పవన్ నేరుగా విడుదల చేసిన వీడియో కూడా ఏమంత ఘాటుగా లేదు. 2014 ఎన్నికల్లో తనని చంద్రబాబు ఎలా వాడుకుందీ, అవసరం తీరాక కరివేపాకులా ఎలా పక్కన పడేసిందీ, రాష్ట్రంలో పాలన ఎలా గాడితప్పిందీ అన్నీ ఏకరువు పెడితేనే చంద్రబాబుకి పవన్ గట్టిగా బుద్ధి చెప్పినట్టు లెక్క. ఆమధ్య తన పర్యటనల్లో చంద్రబాబునీ, లోకేష్ నీ వీర ఉతుకుడు ఉతికిన పవన్ మెల్లగా తన డోస్ తగ్గించేశారు.

Image result for pavan janasena

అలా తగ్గించబట్టే ఇప్పుడు చంద్రబాబుకి ఓ అవకాశం దొరికింది. అందుకే పవన్ తనతో కలసి రావాలని, బీజేపీకి వ్యతిరేకంగా కలసి పనిచేద్దామని బేరంపెట్టారు బాబు. ఇప్పుడు కూడా పవన్ సుతిమెత్తగా మాట్లాడితే కుదరదని జనసైనికుల అభిప్రాయం. అసలు తన ప్రమేయం లేకుండా తనతో కలసి పనిచేయాలని బాబు ఎలా ఊహించారని పవన్ గట్టిగా ప్రశ్నించాలి. పదే పదే ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వచ్చే ఎన్నికల్లో బాబుకు జనసేన బుద్ధి చెబుతుందని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలని వారి అభిమతం.

మరింత సమాచారం తెలుసుకోండి: