వైసిపిలోకి మరో ప్రముఖ హాస్యనటుడు ఆలీ చేరుతున్నారు. సినీరంగంలోని చాలా మంది ప్రముఖుల్లో ఎక్కువమంది వైసిపిలోకి చేరటానికే మొగ్గు చూపుతున్నారు. అదే వరసలో ఆలీ కూడా చేరుతుండటం గమనార్హం. పోయిన నెలలో జగన్ , ఆలీ కలిసి ఒకే విమానంలో విశాఖపట్నం నుండి హైదరాబాద్ కు ప్రయాణం చేశారు. బహుశా ఆ సమయంలోనే ఇద్దరి మధ్య చర్చలు జరిగుంటాయి. ఆ తర్వాతే ఆలీ వైసిపిలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 9వ తేదీన పాదయాత్ర ముగింపు సదర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో భారీ బహిరంగసభ జరుగుతోంది. ఆ సమయంలో ఆలీ వైసిపి కండువా కప్పుకోనున్నారు.

 Image result for ys jagan and ali

అదే విషయాన్ని ఆలీ మాట్లాడుతూ తాను వైసిపిలో చేరనున్నట్లు ధృవీకరించారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీకి కూడా సిద్ధమేనంటూ చెప్పారు. నిజానికి ఆలీ తెలుగుదేశంపార్టీకి దగ్గరగా ఉంటారు. వ్యక్తిగతంగా పవన్ కల్యాణ్ కు బాగా సన్నిహితుడు. పోయిన ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున రాజమండ్రిలో పోటీ చేయటానికి ప్రయత్నించారు కూడా. కాకపోతే చంద్రబాబునాయుడు టిక్కెట్టు ఇవ్వలేదు. అప్పటి నుండి టిడిపికి దూరంగా ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ టిడిపి నుండే పోటీ చేయటానికి ప్రయత్నాలు కూడా చేసుకున్నారు. కానీ ఇంతలోనే మనసు మార్చుకుని వైసిపిలోకి వచ్చేస్తున్నారు.

 Image result for ys jagan and ali

వచ్చే ఎన్నికల్లో ఆలీ వైసిపి తరపున పోటీ చేస్తారా లేదా అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అనే చెప్పాలి. పోటీ చేయించాలా ? లేకపోతే ప్రచారానికి మాత్రమే వాడుకోవాలా ? అన్నది జగన్ నిర్ణయంపై ఆధారపడిన విషయం అని అందరికీ తెలిసిందే. వ్యక్తిగతంగా పవన్ కు బాగా సన్నిహితుడైన ఆలీ జనసేనలో చేరకుండా వైసిపిలో ఎందుకు చేరుతున్నారో అర్ధం కావటం లేదు. ఆమధ్య మరో సినీనటుడు బండ్ల గణేష్ కూడా కాంగ్రెస్ లో చేరారు. గణేష్ కూడా పవన్ బాగా సన్నిహితుడే. కాకపోతే గణేష్ తెలంగాణా కాంగ్రెస్ లో చేరారు కాబట్టి సరిపోయింది. కానీ ఇఫుడు ఆలీ విషయం అలా కాదు. వైసిపిలో చేరుతున్న ఆలీ రేపటి ఎన్నికల్లో పవన్ కల్యాణ్, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సుంటుంది. మరి ఆలీ ఏం చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: