వైసీపీలోకి ఇపుడు సినీ తళుకుబెళుకులు ఎక్కువవుతున్నాయి. రేపటి ఎన్నికల్లో సేఫెస్ట్ పార్టీగా సినీ జనం గుర్తిస్తున్నట్లున్నారు. దాంతో ఎక్కడ లేని రంగులు ఇపుడు ఫ్యాన్ పార్టీని తాకుతున్నాయి. ఇప్పటికే హాస్యనటుడు, ప్రుధ్వీ, సీనియర్ నటుడు భాను చందర్, మరో నటుడు పోసాని క్రిష్ణ మురళి వంటి వారు వైసీపీలో చేరారు. ఇపుడు మరో సీనియర్ హాస్య నటుడు వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు
.
ఇచ్చాపురం వేదికగా:


హాస్యనటుడు ఆలీ వైసీపీలో చేరుతారని చాలాకాలంగా ప్రచారంలో ఉంది. ఆయన జగన్ తో విమానంలో పక్కన కూర్చుని ముచ్చట్లు చెబుతున్నపుడే వైసీపీలోకి వస్తారని స్పష్టమైంది. అయితే అది చాలా  తొందరలోనే సాకారమవుతోంది. ఈ నెల 9న ఇచ్చాపురం వేదికగా జరిగే ప్రజా సంకల్ప యాత్ర ముగింపు కార్యక్రమంలొ జగన్ సమక్షంలో ఆలీ వైసీపీ కండువా కప్పుకుంటారని అంటున్నారు. ఆలీ వంటి నటుడు, మైనారిటీ వర్గానికి చెందిన వారు వైసీపీలో చేరడం ద్వారా ఆ వర్గంలో పార్టీ బలం మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు.


పవన్ కి ఝలక్ :


ఇక ఆలీ సినీ నటుడు, జనసేనాని పవన్ కి అత్యంత సన్నిహితుడన్నది అందరికీ తెలిసిందే. పవన్ పార్టీ పెడితే అందులో ఆలీ తప్పకుండా చేరుతారని అంతా భావించారు. ఈ మధ్యనే నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగ సందర్భంగా పవన్ తో కలసి ఆలీ కనిపించారు. దాంతో ఆలీ జనసేనలో చేరడం ఖాయమన్న మాట వినిపించింది. మరి ఆలీ ఇపుడిలా ట్విస్ట్ ఇవ్వడం నిజంగా పవన్ కి ఝలక్ లాంటిందేనని అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: