జగన్ కేసు ను ఎన్ఐఏ విచారణకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు గురించి లోకేష్ బాబు ట్విట్టర్ లో స్పదించడం టాక్ అఫ్ ది టౌన్ అయ్యింది. హైకోర్టు తీర్పు అలా వచ్చిందో లేదో.. లోకేష్ వరసగా ట్వీట్లు పెట్టడం మొదలుపెట్టాడు. ప్రత్యేకించి జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ విచారణకు ఇవ్వడాన్ని లోకేష్ ఆక్షేపించడం విశేషం! జగన్ పై హత్యాయత్నాన్ని జగనే చేయించుకున్నాడని, జగన్ ఇంట్లోవాళ్లే ఆ పని చేయించారని.. టీడీపీ వాళ్లు అన్నారు కదా.

Image result for lokesh

ఎన్ఐఏ అదే విషయాన్ని తేలిస్తే తెలుగుదేశం పార్టీకే మేలు కదా. అందులో లోకేష్ బాబు అంతలా ఉలిక్కిపడిపోవడానికి ఏముంది? ‘కోడి కత్తి కేసును అంతర్జాతీయ విచారణ సంస్థకు అప్పగించినా నిజం మారదు.. “అని ట్వీటేయడంతో పాటు.. వరసగా మోడీని, జగన్ ను నిందిస్తూ లోకేష్ బాబు ట్వీట్లు పెడుతూనే ఉన్నాడు. ఈ రోజు కూడా ఆ పరంపర కొనసాగుతూ ఉంది.

ఎన్ఐఏ విచారణ.. లోకేష్ ఉలికిపాటు!

హైకోర్టు తీర్పు వచ్చినప్పటి నుంచినే లోకేష్ లో ఈ ఉలికిపాటు గట్టిగా వ్యక్తం అవుతోంది. దీనివెనుక లోగుట్టు ఏమిటో అనే కామెంట్లు వినిపిస్తున్నాయిప్పుడు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును కడిగేస్తేనే.. లోకేష్ స్పందించడానికి ముందుకు రాలేదు. తన తండ్రి విషయంలో వేరే వ్యక్తి అలా మాట్లాడితే.. కౌంటర్లు ఇవ్వడానికి ప్రెస్ మీట్ పెట్టలేదు లోకేష్. అలాంటిది.. జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏ విచారణకు ఇస్తేమాత్రం.. వరస ట్వీట్లతో తన ప్రతిభను అంతా చూపిస్తున్నాడు. ఏంది కథ?

మరింత సమాచారం తెలుసుకోండి: