తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకోని నిరుద్యోగభృతి పథకాన్ని అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. ప్రాథమికంగా రూపొందించిన నిబంధనల ప్రకారం 18-35 ఏళ్ల మధ్య వయసు కలిగి - చదువుకోకుండా - చేయడానికి పనిలేకుండా ఉన్నవారినే నిరుద్యోగులుగా గుర్తించనున్నారని తెలుస్తోంది. వయోపరిమితిలో వెసులుబాటు కల్పించడంపైనా చర్చ జరుగుతున్నట్టు సమాచారం.

Image result for kcr

పదో తరగతి పాసైన విద్యార్థులు ఎంతమంది చదువు మానేశారు? ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఎంతమంది చదువు ఆపేశారు? ఎంతమంది ప్రభుత్వ - ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు? పీజీ ఎంతమంది చదువుతున్నారు? రిసెర్చ్ స్కాలర్లుగా ఎంతమంది ఉన్నారు? విదేశాలకు ఎంతమంది వెళ్లి చదువుకుంటున్నారు? తదితర అంశాలు కొలమానాలుగా నిరుద్యోగుల లెక్క తేల్చాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకం పక్కదారి పట్టకుండా - అమలుకు కొంత వెసులుబాటు తీసుకునైనా సరే.. పక్కాగా అమలుచేయాలని సర్కారు పెద్దలు భావిస్తున్నారు.

Image result for kcr

ఇందుకోసం నిరుద్యోగుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలా? ఉపాధికల్పన కేంద్రాల్లో పేర్లను రిజిస్టర్ చేయించాలా? అనే అంశాలపై సమాలోచనలు సాగుతున్నాయి. జిల్లాస్థాయిలో నిరుద్యోగుల జాబితాను ఫైనల్ చేసేలా మార్గదర్శకాలు రూపొందించే అంశంపైనా కసరత్తు చేస్తున్నారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఈ పథకానికి దరఖాస్తుచేసి లబ్ధిపొందితే తీవ్ర నేరంగా పరిగణిస్తారని సమాచారం. అలాంటివారిని గుర్తించేందుకు ఏర్పాట్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 2 వ తేదీ నుంచే నిరుద్యోగ భృతి అందిస్తారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: