విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాశ్ రాజ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే! ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఇంతకూ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు.

 Image result for prakash raj

ప్రకాశ్ రాజ్ ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడ్తారనే విషయం తెలిసిందే! ముఖ్యంగా ప్రధాని మోదీ టార్గెట్ గా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. కర్నాటకలో తన ఫ్రెండ్, రచయిత్రి గౌరీ లంకేష్ హత్య తర్వాత ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. మోదీని నేరుగా టార్గెట్ చేసి ఆయన విమర్శలు గుప్పించారు. దీంతో స్థానిక బీజేపీ నేతలు ప్రకాశ్ రాజ్ ను టార్గెట్ చేశారు. అయినా ఏమాత్రం తగ్గని ప్రకాశ్ రాజ్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తీరును ఎండగట్టారు. ఇది కాంగ్రెస్, జేడీఎస్ లకు కలిసొచ్చింది.

 Image result for prakash raj

ప్రకాశ్ రాజ్ జాతీయ మీడియాలో కూడా చురుగ్గా వ్యవహరిస్తుంటారు. బీజేపీ విధానాలను, మోదీ నిర్ణయాలను ఆయన తీవ్రంగా తప్పుబడుతుంటారు. ఏకంగా జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఓ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇప్పుడు నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగుతానని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని చెప్పడంతో ఏ పార్టీలో చేరబోవడం లేదని తెలిసిపోయింది. అయితే ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారనేదానిపై ఆసక్తి నెలకొంది.

 Image result for prakash raj

ప్రకాశ్ రాజ్ స్వరాష్ట్ర కర్నాటక. అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలన్నింటితో మంచి సాన్నిహిత్యమే ఉంది. ముఖ్యంగా అధికార జేడీఎస్ తోనూ, ముఖ్యమంత్రి కుమారస్వామితోనూ దగ్గరి సంబంధాలున్నాయి. అదే సమయంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ తో కూడా ప్రకాశ్ రాజ్ కు సాన్నిహిత్యం ఉంది. కేసీఆర్, కేటీఆర్ లతో స్నేహం ఉంది. ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతుగా కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రకాశ్ రాజ్ మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో ఆయన కర్నాటక లేదు తెలంగాణ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: