జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు కుదిరితే వామపక్ష పార్టీలతో తప్ప వేరే పార్టీలతో పొత్తు ఉండదని తేల్చి చెప్పేశారు ఇటీవల. ఇదే క్రమంలో జిల్లా నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వారి దగ్గర నుండి సలహాలు తీసుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా ఇటీవల సోషల్ మీడియాలో ఏపీ మహిళలకు ఒక శుభవార్త తెలియజేశారు.

Image may contain: 1 person, sitting

2019 ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అయితే కచ్చితంగా సమాజంలో మహిళలకు తగిన విధంగా ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా జనసేన పార్టీ కీలక నిర్ణయాలు తీసుకున్న పోతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నట్లు ఇటీవల ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

Image may contain: 1 person, sitting, beard and indoor

అలాగే వారి కోసం ప్రత్యేక ఆర్థిక వ్యవస్థను, మహిళా బ్యాంకును సైతం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తాము కొత్తగా చట్టాలు చేయబోమని, ప్రస్తుతం ఉన్న చట్టాలనే పగడ్బందీగా అమలు చేస్తామన్నారు.

Image may contain: 13 people, people sitting

మహిళల రక్షణ జనసేన బాధ్యత అని పేర్కొన్న పవన్‌కల్యాన్‌ పార్టీ ఎమ్మెల్యేలు మహిళల గురించి తప్పుగా మాట్లాడుతున్నా ప్రభుత్వం నోరు మెదపడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళల రక్షణ కోసం కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: