ఎన్నికలు వస్తున్న క్రమంలో ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు ప్రజలతో కూడా చాలా సమయం గడుపుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో ఇటీవల పునాదిపాడు గ్రామం సందర్శించిన చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పునాదిపాడు ఎంతో చరిత్ర కలిగిన గ్రామం అని ఈ గ్రామంలో ఉన్న నాయకులు గ్రామ ప్రతిష్ట పెరిగేలా పని చేయాలని కోరారు.

Image result for chandrababu

కృష్ణాజిల్లా పునాదిపాడు గ్రామంలో 6వ విడత జన్మభూమి- మాఊరు కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన హాజరైన ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రావడానికి ఇంకా సమయంవున్నా పునాదిపాడు గ్రామానికి జన్మభూమి కార్య క్రమంతో ముందే సంక్రాంతి వచ్చినట్లు వుంద న్నారు.

Related image

ఐదురోజులపాటు జన్మభూమి కార్యక్ర మాల్లో ఐదు జిల్లాల్లో తిరిగానని ఈ రోజు జన్మ భూమికి వచ్చిన స్పందన చాలా బాగుందన్నారు. గతంలో ఈగ్రామంలో జన్మభూమి కార్యక్ర మంలో పాల్గొన్నప్పుడు 28 లక్షల రూపాయ లతో జన్మభూమి భవనాన్ని నిర్మించామని ఈ భవనం నిర్మించడానికి కృష్ణమూర్తి, రామ కోటేశ్వరరావు, భద్రాచలం, శకుంతల, సుబ్బా రావు లాంటి వారు ముందుకొచ్చి రు.14లక్షలు ఇవ్వడా మిగతా రు.14లక్షలను ప్రభుత్వమిచ్చి భవనంనిర్మించిందన్నారు.

Related image

ఇదే క్రమంలో పొల్యూషన్ రహిత వాహనాలు గురించి మరియు ప్రకృతి ఆ గ్రామంలో ఉన్న పాఠశాలల గురించి పొగడ్తల వర్షం కురిపించారు చంద్రబాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: