వైసీపీ అధినేత జగన్ ఏపీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. త్రుటిలో అధికారం కోల్పోయిన నేత. ఓ విధంగా చెప్పాలంటే వెయింటింగ్ చీఫ్ మినిస్టర్. ఏపీకి సంబంధిచి ప్రతి విషయంలోనూ సంపూర్ణ అవగాహన ఉండాల్సిన నాయకుడు. అంతే కాదు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, జాతీయ రాజకీయాలపైన కూడా స్పష్టమైన విధానం కలిగి ఉండాల్సిన నాయకుడు. మరి జగన్ వద్ద అన్ని ప్రశ్నలకూ జవాబు దొరుకుతోందా .


రాజధానిపైన :


ముందుగా ఏపీ రాజధాని అమరావతి విషయం తీసుకుంటే దీనిపైన జగన్ విధానం ఏంటన్నది ఇప్పటికీ స్పష్టం కాలేదు. జగన్ పాదయాత్ర సందర్భంగా పలు చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో జగన్ ఈ విషయంలో దాటించే ధోరణినే కనబరచారు. రాజధాని ఓ స్కాం అన్నారు, అక్కడ ఇన్ సైడ్  ట్రేడింగ్ జరిగిందన్నారు. ఒక్క పర్మనెంట్ ఇటిక కూడా పడలేదని దెప్పిపొడిచారు ఇవన్నీ నిజనేనని అనుకున్నా జగన్ కంటూ ఓ విధానం ఉంటుంది కదా. రాజధాని విషయంలో నేను అధికరంలోకి రాగానే ఇలా చేస్తాను అని ఎందుకు చెప్పడం లేదు. నిజానికి అమరావతి రాజధాని జగన్ కి ఇష్టం లేదని టీడీపీ ఓ వీపు ప్రచారం చేస్తోంది.


దానికి అనుగుణంగానే జగన్ కూడా ఏమీ తల్చడం లేదు. ఇక్కడ జవాబు జనాలకు రావాల్సిన అవసరం ఉంది. ఇక రాజధాని విషయంలో మరిన్ని అభిప్రాయాలు జన బాహుళ్యంలో కూడా ఉన్నాయి. రాయలసీమ వాసులు మోసపోయామన్న భావనతో ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అభివ్రుధ్ధి లేదన్న బాధతో ఉన్నారు. అందువల్ల జగన్ తాను అధికారంలోకి వస్తే ఈ రెండు ప్రాంతాలకు  రాజధానితో సమాన అభివ్రుధ్ధి చేస్తానని చెప్పాల్సిన అవసరం  కూడా ఉంది.


పోలవరం :


అదే విధంగా పోలవరం విషయంలోనూ జగన్ పక్కా క్లారిటీతో సమాధానం ఇవ్వాల్సిఉంది. ఎంత కాదనుకున్నా టీడీపీ సర్కార్ పోలవరం విషయంలో కొంత పని చేసింది, చేస్తోంది కూడా. మేము అధికారంలోకి వస్తే ఈ టైం బాండ్ లో నిర్మిస్తాం, నీళ్ళిస్తామని జగన్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంతే  తప్ప పునాదుల గోడలు కూడా పోలవరం కదల్లేదు అని విమర్శలు చేసి ఊరుకోవడం రేపటి ముఖ్యమంత్రిగా భావిస్తున్న జగన్ కి కుదరని వ్యవహారమే అవుతుంది. 


ప్రత్యేక హోదా :


ప్రత్యేక హోదాను సాధిస్తామని జగన్ అంటున్నారు. మంచిదే, దానికి ప్రాతిపదిక కూడా జనం ముందు ఉంచాలి కదా. టీడీపీ విషయమే తీసుకుంటే కాంగ్రెస్ కూటమిలో ఆ పార్టీ ఉంది. రాహులు హోదా ఇస్తామని అంటున్నారు. అందువల్ల రేపు మేము ఇలా ఏపీకి హోదా సాధిస్తామని చెప్పుకుంటున్నారు. మరి మీ విషయంలో ఏంటని అడిగితే జగన్ క్లారిటీతో ఆన్సర్ చేయడంలేదన్న మాట వినిపిస్తోంది. మేము బీజేపీ కూటమిలో ఉంటాము, కాంగ్రెస్ కూటమిలో ఉంటాం, లేదు ఫెడరల్ ఫ్రంట్ లో ఉంటాం ఆ విధంగా హోదాను తెస్తామని జగన్ లాంటి నాయకుడు ఈ కీలక‌ సమయంలో చెప్పాల్సిన అవసరం ఉంది.


జాతీయ రాజకీయాలు :


సంకీర్ణ యుగంలో జాతీయ రాజకీయల మీద కూడా ప్రతీ పార్టీ స్పందించాలి.  ఈ దేశానికి ఎవరు ప్రధానిగా ఉండాలి. విభజన తరువాత నష్టపోయిన రాష్ట్రానికి ఏ విధంగా పూడ్చుకోవాలి అన్న దాని మీద క్లారిటీతో ఉండాలి. జగన్ జాతీయ రాజకీయ మీద ఇంతవరకూ పెదవి విప్పలేదు. ఆయన పార్టీకి మెజారిటీ ఎంపీ సీట్లు వస్తాయని పలు సర్వేలు చెబుతున్న వేళ తాను ఈ విధంగా రేపటి జాతీయ రాజకీయాలలో ప్రధాన పాత్ర పోషిస్తానని జగన్ ప్రకటించడం ద్వారా మరింతగా జనాదరణ పొందే వీలు ఉంటుంది. జగన్ ఇలా అనేక కీలక అంశాల మీద వచ్చే ప్రశ్నలకు జవాబు చెప్పినపుడే ఆయన  నిబద్ధతను జనం గుర్తిచే అవకాశమూ ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: