జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణలో ఎన్ఐఏకి చుక్కలు కనిపిస్తున్నాయి. బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఎన్ఐఏకి ఇటువంటి అనుభవం ఎదురవ్వలేదేమో ? ప్రధానమంత్రి నరేంద్రమోడితో చంద్రబాబునాయుడుకు చెడిన తర్వాత తలెత్తిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఎన్ఐఏకి రాష్ట్ర పోలీసులు ఏమాత్రం సహకరించటం లేదు. జగన్ పై హత్యాయత్నం కేసును ఎన్ఐఏకి హై కోర్టు అప్పగించగానే రాష్ట్ర పోలీసులు కేసు ఫైలు మొత్తాన్ని తమకు చేతికి అందుతుందని ఎన్ఐఏ ఉన్నతాధికారులు అనుకుని ఉండొచ్చు. అందుకనే జనవరి 1వ తేదీన ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేయటంతో పాటు వెంటనే యాక్షన్ లోకి దిగేసింది.

 

హై కోర్టు ఆదేశాలు రావటంతోనే ఎన్ఐఏ ఉన్నతాధికారులు వెంటనే విశాఖపట్నం చేరుకున్నారు. అప్పటి వరకూ కేసును దర్యాప్తు చేసిన స్ధానిక పోలీసులను ఎన్ఐఏ అధికారులు కలుసుకున్నారు. అంతకుముందే విశాఖపట్నం పోలీసు కమీషనర్ మహేష్ చంద్ర లడ్హా శెలవుపై వెళ్ళిపోవటం కూడా అనుమానాలకు దారితీస్తోంది. అంటే ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకునే ముందు రోజే లడ్హా లీవుపై వెళ్ళటమే అనుమానాలకు దారితీసింది. కమీషనర్ లేకపోవటంతో లోకల్ పోలీసులనే ఎన్ఐఏ సంప్రదించాల్సొచ్చింది. సమస్యంతా అక్కడే మొదలైంది.

 

లోకల్ పోలీసులేమో తమకు కేసు ఫైలును ఎన్ఐఏకి అప్పగించమని ఆదేశాలు రానికారణంగా తాము వివరాలు ఇవ్వలేమని చేతులెత్తేశారు. దాంతో ఏం చేయాలో ఎన్ఐఏకి దిక్కుతోచటం లేదు. అదే సమయంలో నిందితుడు శ్రీనివాస్ విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నారు. నిందితుడికి బెయిల్ ఇవ్వాలంటూ న్యాయవాది సలీం బెయిల్ పిటీషన్ వేశారు. అనుమతి లేకుండా నిందుతుడిని ఎన్ఐఏ విచారించేందుకు లేదని సలీం చెప్పటం విచిత్రంగా ఉంది. అంటే ఇటు పోలీసులూ సహకరించక, అటు నిందితుడిని విచారించేందుకు లేకపోతే ఇక ఎన్ఐఏ దర్యాప్తు ఏ విధంగా మందుకు సాగుతుంది ? అంటే దర్యాప్తు సక్రమంగా జరిగితే హత్యాయత్నం కేసులో అసలు సూత్రదారులు బయటకు వస్తారన్న ఉద్దేశ్యంతో చంద్రబాబే అడ్డంకులు సృష్టిస్తున్నారన్న వైసిపి నేతల ఆరోపణలే నమ్మాల్సొస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: