చారిత్రాత్మక పాదయాత్రగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను పేర్కొనాలి. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ దాదాపు 14 నెలల పాటు జగన్ అలుపెరగని రీతిలో వేసిన అడుగులు వర్తమా దేశ చరిత్రలో ఓ సాహస పర్వమే. పాదయాత్రలనే వైఎస్ కుటుంబం పేటెంట్ గా తీసుకుందా అన్నంతగా ఒకే కుటుంబం నుంచి వైస్సార్, షర్మిల, జగన్ వేల కిలోమీటర్లు నడచి జనాలకు చేరువ కావడం నిజంగా ఓ చరిత్ర.


నాడు తండ్రి :


పాదయాత్ర అన్నది పదునైన రాజకీయ బాణం అని వైస్సార్ రుజువు చేశారు. 2003 ఏప్రిల్ 9న ఆయన రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఏకంగా 67 రోజుల పాటు విరామం ఎరగని తీరులో పయనం సాగించి ఇచ్చాపురం వద్ద ముగించారు. అపుడు గడ్డు వేసవి మండే ఎండలకు వడదెబ్బ తగిలినా పట్టుదల మాత్రం తగ్గలేదు. పాదయాత్ర వైఎస్ ను ఒక రాజర్షిలా మార్చేసింది. అప్పటికి ఉమ్మడి ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు పాలన పట్ల గూడు కట్టుకున్న అసంత్రుప్తిని ఒక్కటి గా  చేసి మొత్తం తన వెనకన నడిచేలా వైఎస్సార్ పాదయాత్ర సాగింది. కోట్లాడి పేదలు, బడుగులనే జనాస్త్రంగా ప్రయోగించి వైఎస్సార్ 2004 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. మళ్ళీ అధికారం ఖాయ‌మనుకున్న టీడీపీని ఇంటికి పంపించారు.


అవే పరిస్థితులు :


 ఇపుడు కూడా ఇంచు ఇంచు అవే పరిస్థితులు, ఏపీలో అయిదేళ్ళ పాలన దగ్గర పడుతోంది. మళ్ళీ ఇపుడు కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి. ఆయన్ని ఎదిరిస్తూ జనంతో కలసి పోరాటం చేస్తున్నది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్. నవంబర్ 6 2017లో  జగన్ ప్రారంభించిన పాదయాత్ర ఓ ఉత్తుంగ జన తరంగంగా సాగుతూ జనమే జనంగా తలపించింది. పాదయాత్ర ద్వారా ఏపీలోని అధికార పార్టీ వ్యతిరేక వర్గాన్ని ఒకటిగా జగన్ చేయగలిగారు. తండ్రి లాగనే ఆ జనం మద్దతుతో రేపటి ఎన్నికల్లో సమర శంఖారావాన్ని పూరించనున్నారు. నాడు పాదయాత్ర ద్వారానే అధికారం చేపట్టిన ఘనత రాజశేఖరరెడ్డికి దక్కింది. మరి తనయుడు కూడా ఆ సెంటిమెంట్ ని తిరగరాస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


కీలక ప్రకటన :


జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ పాదయాత్ర ఈ  రోజు ఇచ్చాపురం వద్ద కొత్త కొజ్జీరియా గ్రామంలో ప్రారంభమై ఇచ్చాపురం బస్టాండు వద్ద ముగుస్తుంది. 341వ రోజు పాదయాత్రలో 10 కిలోమీటర్ల దూరం జగన్ నడుస్తారు. మధ్యాహ్యం భోజన విరామ సమయంలో జగన్ లొద్దిపుట్టి గ్రామంలో ఆగుతారు. ఆ తరువాత జాతీయ రహదారికికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో సుదీర్ఘ పాదయాత్రకు సూచికగ  విజయ స్తూపాన్ని ప్రారంభిస్తారు. అక్కడ నుంచి  రెండు కిలోమీటర్ల దూరం నడచి ఇచ్చార్పురం పట్టణంలో బహిరంగ సభలో పాల్గొనంటారు. ఆ తరువాత బస్టాండ్ వరకు నడచిన మీదటన తన పాదయాత్రను ఘనంగా ముగిస్తారు.


ఇదిలా ఉండగా పాదయాత్ర ముగింపు సందర్భంగా జగన్ కీలక ప్రకటన చేస్తారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆయన ఏం చేయబోతారు, అభ్యర్ధుల ప్రకటన ఉంటుందా. ప్రభుత్వంపై  పదునైన బాణాలు సందిస్తార అన్నది చర్చగా ఉంది. ఏది ఏమైనా ఈ రోజు వైసీపీ చరిత్రలో ఓ సంచలనానికి జగన్ నాంది పలుకుతారని అంటున్నారు. ఇది నాందిగా ఏపీ రాజకీయాల్లోనూ జగన్ చరిత్ర స్రుష్టించబోతున్నారని అంటున్నారు. చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: