జగన్ పాదయాత్ర కనీ వినీ ఎరుగని రీతిలో సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఇసుకేస్తే రాలనంత జనం ఎటు చుసిన జన సునామీ . ఇన్ని రోజులు జగన్ పాదయాత్ర ఒక కెరటం లా ఎగిసి పడింది. ఎక్కడ తగ్గకుండా నభూతో నభవిష్యత్ అంటూ దిగ్విజయంగా పూర్తయింది. రోజులు మారాయి.. కేలండర్లో నెలల మారాయి.. కాలాలు మారాయి... వెళ్లిన రుతువులే మాళ్లీ వచ్చాయి.. జగన్ పాదయాత్ర సాగుతూనే వచ్చింది. తన లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా జగన్ ఇప్పుడు పాదయాత్ర లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు. పాదయాత్రను ముగిస్తూ కొత్త యాత్రను చేపట్టబోతున్నాడు.


ఈ పాదయాత్రతో జగన్ కోట్లమంది ప్రజలకు చేరువయ్యాడు. తన గురించి గత ఎన్నికలకు ముందు జరిగిన ప్రచారాలు ఏమిటో.. వాస్తవంగా తను ఏమిటో.. ప్రజలకు వివరించుకోవడానికి జగన్ కు పాదయాత్ర అద్బుత అవకాశంగా నిలిచింది. సుదీర్ఘకాలం పాటు ప్రజల మధ్యన అది కూడా అనునిత్యం కొన్నివేల మధ్యన సాగుతూ కూడా ఎక్కడైనా జగన్ చిరు కోపాన్నో, కాసింత అసహనాన్నో చూపిస్తాడేమో దాన్ని భూతద్దం చూపిద్దానికి వ్యతిరేక మీడియా వేచి చూసింది.

YS Jagan Mohan Reddy padayatra ends at Ichapuram

వేల కిలోమీటర్ల యాత్ర.. వందరోజుల పాటు సాగినా.. ఎక్కడా ఆ మీడియాకు కూడా అలాంటి అవకాశం దక్కలేదు! జగన్ పాదయాత్రకు వస్తున్న స్పందనను చూపించకపోవడం మినహా.. మరింకేం చేయలేకపోయాయి ప్రత్యర్తి మీడియా వర్గాలు. సరిగ్గా వైఎస్ పాదయాత్ర కూడా ఇచ్ఛాపురంలోనే ముగిసింది. పాదయాత్ర ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికలతో వైఎస్ ముఖ్యమంత్రిగా పట్టాబిషిక్తుడయ్యాడు. జగన్ పాదయాత్రకు కూడా పరిపూర్ణత లభించేది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తేనే! రాష్ట్ర రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా పాదయాత్ర చేసినవారు దాన్ని సాధించుకుని తీరారు. జగన్ కు కూడా ప్రస్తుతానికి ఆ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక మిగతా కథను కాలమే తేల్చాలి! అది కూడా ఇంకో నాలుగు నెలల్లో!

మరింత సమాచారం తెలుసుకోండి: