జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు త్వరలో కొత్త సినిమా మొదలవ్వబోతోంది. సినిమాల్లో ఉన్నంత కాలం జనాలకు పవన్ సినిమాలు చూపించేవారు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన ఇంత కాలానికి పార్టీ జనాలు కొత్త సినిమా చూపించబోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, తొందరలో నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించనున్నారు. ఎన్నికలకు ముందుగా నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమిస్తున్నారంటే ఏమిటర్ధం ? రేపటి ఎన్నికల్లో అభ్యర్ధులుగా పోటీచేసే అవకాశం త్వరలో నియమితులవ్వబోయే సమన్వయకర్తలకే  అవకాశం ఎక్కువుందనే కదా ?

 Image result for pawan kalyan party meetings

ఇంతకాలం జనసేనలో ఎక్కడా పెద్దగా రాద్దాంతాలు లేవనే చెప్పాలి. ఎందుకంటే, పార్టీలో ఎవరికీ పదవులు లేవు కాబట్టి. ఏదో పవన్ కోటరిగా పార్టీలో మొదటినుండి చెలామణి అవుతున్న వారికి, కొత్తగా వచ్చి చేరిన నాదెండ్ల మనోహర్ లాంటి వారికి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జిల్లాల టూర్లకు వెళ్ళినపుడు మాత్రం ఏదో అభిమానుల అండతో పర్యటనలను నెట్టుకొచ్చేస్తున్నారు. అయితే, షెడ్యూల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమన్వయకర్తలను నియమించాలని పవన్ నిర్ణయించారు. దాంతో ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఎన్ఆర్ఐల తాకిడి పెరిగిపోతోందని ప్రచారం జరుగుతోంది.

 Image result for pawan kalyan party meetings

అంటే జనసేన తరపున పోటీ చేసేందుకు ఒకవైపు ఎన్ఆర్ఐలు, మరోవైపు పార్టీలోని నేతలు, ఇతర పార్టీల్లో నుండి వచ్చే నేతలు, ఇంకోవైపు అభిమాన సంఘాల్లోని కీలక వ్యక్తుల మధ్య పోటీ మొదలైందట. సమన్వయకర్తలను నియమించాలంటే పై మూడు వర్గాల్లోని వాళ్ళను పవన్ సమన్వయం చేసుకోవాలి. అయితే, పై మూడు వర్గాల్లోని వాళ్ళకు ఒకరితో మరొకరికి ఎటువంటి సంబంధాలు లేవు. కాబట్టి ఎవరిని సమన్వయకర్తలుగా నియమించినా మిగిలిన రెండు వర్గాలు వ్యతిరేకమవ్వటం ఖాయమనే అనిపిస్తోంది. చివరి రెండు వర్గాల మాట అటుంచినా ఎన్ఆర్ఐలను సమన్వయకర్తలుగా నియమిస్తే మాత్రం పార్టీ నేతలెవరూ ఊరుకునేట్లు లేరు.

 Image result for pawan kalyan party meetings

పైగా తాను నియమించబోయే సమన్వయకర్తలు కూడా తాత్కాలికమే అని పవన్ చెబుతున్న మాటలను ఎవరూ  నమ్మటం లేదు. షెడ్యూల్ ఎన్నికలు మరో రెండునెలల్లో పెట్టుకుని ఇపుడు నియమించే సమన్వయకర్తలు తాత్కాలికమే అని పవన్ చెబితే నమ్మేంత వెంగళప్పలెవరూ లేరు. సమన్వయకర్తల నియామకాలంటూ పవన్ మొదలుపెడితే కదా రియాక్షన్ ఎలాగుంటుందో తెలిసేది. నిజానికి పోయిన ఎన్నికలు అయిపోగానే జనసేన బలోపేతం చేయటంపై దృష్టి పెట్టుంటే సరిపోయేది.

Image result for pawan kalyan party meetings

అప్పట్లోనే సమన్వయకర్తలను నియమించుంటే వారి సామర్ధ్యం, పనితీరు, మార్చాల్సిన వారి జాబితా సిద్ధమయ్యేదే. కానీ చంద్రబాబుతో అంటకాగటంతోనే పవన్ పుణ్యకాలమంతా గడిపేశారు. ఇపుడేదో హడావుడిగా 175 నియోజకవర్గాల్లోను పోటీ చేస్తామని ఒకసారి, వామపక్షాలతో మాత్రమే పొత్తుంటుందని మరోసారి ప్రకటనలిస్తుంటే అందరిలోను అయోమయం మొదలైంది. రాజకీయాల్లో వచ్చే వాళ్ళు సేవ కోసమే రావాలని, పదేళ్ళు పదవులు పనిచేయకుండా పనిచేయాలని పవన్ సినిమా డైలాగులు చెబితే వినేవాళ్ళుంటారా ? చూద్దాం సమన్వయకర్తల నియామకాలు మొదలైన తర్వాత జనసేనలో ఏమవుతుందో ?


మరింత సమాచారం తెలుసుకోండి: