ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో చారిత్రక సంఘటనలు చూశాం..పురావస్తు పరిశోధనలో ఎన్నో అద్భుతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదువేళ ఏళ్ల కిందట వెలసిల్లిన హరప్పా నాగరికత ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా దాదాపు 4,500 ఏళ్ల క్రితం ఒక జంటను ఖననం చేసిన సమాధి, ఇప్పుడు పురావస్తు శాఖ తవ్వకాలలో వెలుగు చూసింది. హరప్పా గుహల సమీపంలో నిర్వహించిన పురావస్తు తవ్వకాలలో వెలుగు చూసిన పురాతన నగరం శివార్లలో ఈ సమాధిని కనుగొన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Related image

హర్యానా రాష్ట్రంలోని రాఖీగఢి గ్రామ సమీపంలో 2016లో నిర్వహించిన పురావస్తు తవ్వకాలలో హరప్పా నాగరికత నాటి అత్యంత అరుదైన జంట అస్తిపంజరాలను భారత్‌, ద.కొరియాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారిద్దరిని వేరువేరు కాలాల్లో కాకుండా ఒకేసారి సమాధి చేశారని పురాతత్వ పరీక్షల్లో రుజువైంది. పురుషుని ముఖం స్త్రీ వైపు తిరిగి ఉండడం మరో విశేషంగా చెప్పుకొంటున్నారు. అయితే, కొంత మంది పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రం.. సమాధిలో బయటపడ్డ అస్థి పంజరాలు లింగభేదం కచ్చితంగా చెప్పలేమని, వీరు దంపతులై ఉండరని అంటున్నారని, కానీ హరప్పా నాగరికతలో ఇంత వరకు ఇలాంటి సమాధులు కనుగొనలేదని అన్నారు. 


ఇంతవరపకు హరప్పా సమాధుల్లో జంటగా ఖననం చేసినవి లభించకపోవడం గమనార్హం. గతంలో రెండు పురుషలవి, ఓ మహిళ, ఓ శిశువు కంకాళాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. ఘాగర్ బేసిన్‌లోని రాఖీగఢీ, భిర్రానా, గిరావాడ్, ఫర్మానాలో జరిపిన తవ్వకాల్లో తాజాగా లభించిన ఆధారాలను బట్టి హరప్పా నాగరికత ఆవిర్భావం క్రీస్తుపూర్వం 5500కు మారింది.  ఈ అస్థిపంజరాలపై గత రెండేళ్లుగా పరిశోధనలు కొనసాగించిన శాస్త్రవేత్తలు వారి మరణానికి వెనుక వున్న కారణాలను కనుగొన్నట్లు ఒక ఇంటర్నేషనల్‌ జర్నల్‌లో ప్రచురించిన కథనంలో వెల్లడించారు. 

Related image

చనిపోయిన తర్వాత ఆత్మలు జీవించి ఉంటాయని, ఇవి ఆహారం స్వీకరిస్తాయని హరప్పా కాలం నాటి ప్రజలు నమ్మేవారని, అందుకే సమాధుల్లో కుండలు, పాత్రలను ఉంచేవారని దక్కన్ కాలేజ్ వర్సిటీ వీసీ, పరిశోధకుడు వసంత్ షిండే పేర్కొన్నారు.  కంకాళాల డీఎన్‌ఏ విశ్లేషిస్తే అప్పటి హరప్పన్‌లు ఎలా ఉండేవారో తెలుస్తుందని రాఖీగఢీ తవ్వకాలకు నాయకత్వం వహిస్తున్న పూనా దక్కన్ కాలేజీ ప్రొఫెసర్ వసంత్ షిండే అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: